Sad news : పంజాబీ నటుడు, బాడీ బిల్డర్‌ వీరేందర్‌ గుహ్‌మన్‌ మృతి...శోక సముద్రంలో పంజాబ్

ప్రముఖ బాడీబిల్డర్, పంజాబీ నటుడు వరీందర్ సింగ్ ఘుమాన్ గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 42 సంవత్సరాలు. ఆయన మరణ వార్తను పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యుడు సుక్జిందర్ సింగ్ రంధావా గురువారం సాయంత్రం తన X ఖాతాలో పంచుకున్నారు.

New Update
Varinder Ghuman

Varinder Ghuman

Varinder Ghuman : ప్రముఖ బాడీబిల్డర్, పంజాబీ నటుడు వరీందర్ సింగ్ ఘుమాన్ గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 42 సంవత్సరాలు. ఆయన మరణ వార్తను పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యుడు సుక్జిందర్ సింగ్ రంధావా గురువారం సాయంత్రం తన X ఖాతాలో పంచుకున్నారు. సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన టైగర్ 3 లో వరీందర్ నటించారు, ఈ చిత్రం 2023 లో విడుదలైంది.


 సుఖ్జిందర్ తన X ఖాతాలో రాసిన వివరాల ప్రకారం “పంజాబ్ ప్రసిద్ధ బాడీబిల్డర్, నటుడు వీరేందర్ సింగ్ ఘుమాన్ జీ ఆకస్మిక మరణ వార్త విని నా హృదయం చాలా బాధాకరంగా ఉంది. తన కృషి, క్రమశిక్షణ సామర్థ్యంతో, ఆయన పంజాబ్ పేరును ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తెచ్చారు. వాహెగురు జీ ఆయన ఆత్మకు ఆయన పాదాల వద్ద శాశ్వత నివాసం ప్రసాదించాలని,ఈ దుఃఖకరమైన బాధను భరించే శక్తిని కుటుంబానికి ప్రసాదించాలని కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చారు.

ఈ విషయాన్ని ఆయన కుటుంబం కూడా దృవికరించింది. ఘుమాన్ మేనేజర్ యద్వీందర్ సింగ్ మాట్లాడుతూ, నటుడు భుజం నొప్పితో బాధపడుతున్నాడని, చికిత్స కోసం అమృత్‌సర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడని చెప్పాడు. అతని మేనల్లుడు అమంజోత్ సింగ్ ఘుమాన్ జలంధర్‌లో విలేకరులతో మాట్లాడుతూ, నటుడు సాయంత్రం ఆసుపత్రిలో గుండెపోటుకు గురయ్యాడని చెప్పాడు. నలభై ఒక్క ఏళ్ల ఘుమాన్ 2023లో 'టైగర్-3' చిత్రంలో, 2014లో 'రోర్: టైగర్స్ ఆఫ్ సుందర్‌బన్స్' , 2019లో 'మర్జావాన్' వంటి ఇతర హిందీ చిత్రాలలో సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేశాడు. అతను 2012లో పంజాబీ చిత్రం 'కబడ్డీ వన్స్ ఎగైన్'లో కూడా పనిచేశాడు6 అడుగుల 2 అంగుళాల పొడవున్న ఘుమాన్ 2009లో మిస్టర్ ఇండియా టైటిల్‌ను గెలుచుకున్నాడు. మిస్టర్ ఆసియా పోటీలో రెండవ స్థానంలో నిలిచాడు.

గురుదాస్‌పూర్‌కు చెందిన ఆయన ప్రస్తుతం జలంధర్‌లో నివసిస్తున్నారు, అక్కడ ఆయనకు జిమ్ కూడా ఉంది. "శాఖాహార బాడీబిల్డర్"గా పేరుగాంచిన ఆయన ఫిట్‌నెస్ పట్ల మక్కువ కలిగి ఉండేవారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన వ్యాయామ వీడియోలను క్రమం తప్పకుండా పంచుకునేవారు. 2027లో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే కోరికను కూడా ఆయన వ్యక్తం చేశారు. కాగా, పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. కేంద్ర మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు ఘుమాన్‌ను "పంజాబ్ గర్వం" అని పిలిచారు.ఆయన మరణం "దేశానికి పూడ్చలేని నష్టం" అని అభివర్ణించారు. "పంజాబ్ గర్వకారణమైన, 'భారతదేశ హీ-మాన్' అయిన వరీందర్ ఘుమాన్ జీ మృతి దేశానికి తీరని లోటు. శాఖాహార జీవనశైలితో ఫిట్‌నెస్ ప్రపంచంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పారు. ఆయన జీవితం ఎల్లప్పుడూ యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది" అని బిజెపి నాయకుడు Xలో అన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్ మాట్లాడుతూ, "ప్రఖ్యాత బాడీబిల్డర్, నటుడు వరీందర్ సింగ్ ఘుమాన్ జీ గుండెపోటుతో మరణించడం చాలా బాధాకరం."అతను అంకితభావంతో పనిచేసే శాఖాహారి, క్రమశిక్షణతో తన శరీరాన్ని నిర్మించుకున్నాడు. వాహెగురు ఆయన ఆత్మకు శాశ్వత శాంతిని ప్రసాదించాలని  కోరుకుంటున్నాను. అన్నారు." శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ కూడా విచారం వ్యక్తం చేస్తూ, "అంతర్జాతీయ బాడీబిల్డర్ వరీందర్ ఘుమాన్ అకాల మరణ వార్త విని నేను చాలా బాధపడ్డాను. వరీందర్ చాలా కష్టపడి తన జీవితంలో గొప్ప విజయాలు సాధించాడు; ఆయన మన యువతకు స్ఫూర్తిదాయకం." అని అన్నారు.

Also Read :  మోహన్‌బాబుకు బిగ్‌ షాక్‌... విశ్వవిద్యాలయానికి భారీ జరిమానా

Advertisment
తాజా కథనాలు