Illegal Betting Case : కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఈడీ దాడులు...కోట్లాది డబ్బు..కిలోలకొద్ది బంగారం..

ఆ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ రైడ్‌ చేసింది. ఆ రైడ్‌లో లెక్కకుమించి నోట్ల కట్టలు, కిలోల కొద్ది బంగారం చూసి అధికారులే విస్తుపోయారు. ఇప్పటికే ఒకసారి దాడులు చేసినా ఆయన ఇంటిపై మరోసారి దాడి చేయడం సంచలనంగా మారింది.

New Update
ED raids on Congress MLA

ED raids on Congress MLA

Illegal Betting Case  : ఆ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ రైడ్‌ చేసింది. ఆ రైడ్‌లో లెక్కకుమించి నోట్ల కట్టలు, కిలోల కొద్ది బంగారం చూసి అధికారులే విస్తుపోయారు. ఇప్పటికే ఒకసారి దాడులు చేసినా ఆయన ఇంటిపై మరోసారి దాడి చేయడం సంచలనంగా మారింది. కర్ణాటకకు చెందిన చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర అక్రమ ఆన్ లైన్ బెట్టింగ్ కేసులో అరెస్ట్‌ అయ్యారు. ఆయనపై ఈడీ మరోసారి దాడి చేసింది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌తోకేసీ వీరేంద్ర  ప్రజలను మోసం చేసినట్లు ఈడీ తేల్చింది,  ఆయన తో పాటు ఇతరులపై 2002 PMLA నిబంధనల ప్రకారం ED చర్యలు తీసుకుంటోంది. బెంగళూరులో గురువారం మరోసారి ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో, చల్లకెరె నగరంలో ఉన్న రెండు లాకర్ల నుండి రూ. 50.33 కోట్ల విలువైన 40 కిలోల (సుమారు) బరువున్న 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకోవడం సంచలనం సృష్టించింది.


గతంలోనూ ఈడీ  ఇదే కేసులో దాదాపు 21 కిలోల బంగారు కడ్డీలు, నగదు, బంగారం ఇంకా వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతోపాటు వివిధ బ్యాంకు ఖాతాల నుంచి, ఖరీదైన వాహనాల రూపంలో మొత్తంగా రూ. 103 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. ఇప్పటి వరకూ ఈ కేసులో స్వాధీనం చేసుకున్న నగదు, ఆస్తుల విలువ అంతకలసి రూ. 150 కోట్లకు పైగా ఉంటుందని తేలింది.
 
బెట్టింగ్‌ కేసులో ఆగష్టు 23న సిక్కింలోని గ్యాంగ్‌టక్‌ లో చిత్రదుర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీ వీరేంద్రను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనకు సంబంధించిన కర్ణాటక, ముంబై, గోవా, సిక్కిం, రాజస్థాన్‌లోని 31 ప్రదేశాలలో దాడులు నిర్వహించింది, మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) వీరేంద్రను అరెస్టు చేసింది. అక్రమ ఆన్‌లైన్ మోసాలు, ఆఫ్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల కేసులో మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 కింద వీరేంద్రతో పాటు అతని అనుచరులను అరెస్ట్‌ చేసి కేసులు నమోదు చేశారు. మరో క్యాసినో పెట్టడానికి గాను భూమి లీజుకు తీసుకోవడానికి వీరేంద్ర గ్యాంగ్‌టక్‌లో ఉండగా  ED అదుపులోకి తీసుకుంది. అనంతరం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారు. అనంతరం బెంగళూరులోని న్యాయస్థానం ముందు హాజరుపరిచేందుకు ట్రాన్సిట్ రిమాండ తీసుకున్నారు.

కాగా ఈ కేసులో బెట్టింగ్ కార్యకలాపాలకు సంబంధించిన పలు పత్రాలతో పాటు, బంగారం, ఇతర విలువైన వస్తువులు, ఆస్తి పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. వాటిలో మూడు ఆఫ్‌షోర్ కంపెనీలకి సంబంధించినవి కూడా ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటి వరకూ వీరేంద్ర నుంచి ఈడీ రూ.12 కోట్ల నగదు, రూ. 1 కోటి విదేశీ కరెన్సీ, రూ. 6 కోట్ల విలువైన బంగారు నగలు, 10 కిలోల వెండి వస్తువులు, నాలుగు వాహనాలను స్వాధీనం చేసుకుంది. మొత్తం 17 బ్యాంకు ఖాతాలు, 2 బ్యాంకు లాకర్లను సీజ్ చేసింది.  వీటితో పాటు, వీరేంద్ర నుంచి ఐదు అంతర్జాతీయ క్యాసినో సభ్యత్వ కార్డులు, మూడు లగ్జరీ హాస్పిటాలిటీ సభ్యత్వ కార్డులు, వివిధ బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులను కూడా ED స్వాధీనం చేసుకుంది.

వీరేంద్ర కింగ్567, రాజా567 మొదలైన పేర్లతో అనేక ఆన్‌లైన్ బెట్టింగ్ సైట్‌లను నడుపుతున్నట్లు ఈడీ గుర్తించింది.  వీరేంద్ర సోదరుడు కె.సి. తిప్పేస్వామి, మేనల్లుడు పృథ్వీ ఎన్. రాజ్ దుబాయ్ నుండి డైమండ్ సాఫ్ట్‌టెక్, టిఆర్ఎస్ టెక్నాలజీస్, ప్రైమ్9 టెక్నాలజీస్ అనే మూడు వ్యాపార సంస్థలను నిర్వహిస్తున్నారు. నిజానికి ఇవన్నీ వీరేంద్ర కాల్ సెంటర్ సేవలు, గేమింగ్ వ్యాపారానికి సంబంధించినవిగా ఈడీ పేర్కొంది. ఈ క్రమంలో వీరేంద్ర, తిప్పేస్వామి, కె.సి. నాగరాజ్ ఇళ్లపై కూడా ఈడీ దాడులు చేసింది. వీరిలో కె.సి. నాగరాజ్ కుమారుడు పృథ్వీ ఎన్. రాజ్. వారి ఇళ్లనుంచి నుంచి ఆస్తులకి సంబంధించిన అనేక పత్రాలను స్వాధీనం చేసుకుంది.  గోవాలో వీరేంద్ర నడుపుతున్న ఐదు క్యాసినోలపై కూడా ఈడీ దాడులు చేసింది. పార్లమెంటు ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు, 2025ను ఆమోదించిన కొన్ని రోజులకే ఈ దాడులు జరగడం గమనార్హం.  2016లోనూ, పెద్ద నోట్ల రద్దు తర్వాత కొన్ని రోజులకే చెల్లకెరెలోని వీరేంద్ర ఇంటి బాత్రూంలో ఉన్న ఒక ఒక రహస్య గదిలో ఆదాయపు పన్ను శాఖ రూ. 5.7 కోట్ల నగదును, అన్నీ కొత్త రూ.2,000 నోట్లను స్వాధీనం చేసుకుంది.  ఆ తర్వాత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్‌ టికెట్‌కేటాయించింది. ఆయన  2023లో కాంగ్రెస్ టిక్కెట్‌పై పోటీ చేసి కర్ణాటకలోని చిత్రదుర్గ నుండి ఎమ్మెల్యేగా గెలవడం గమనార్హం.

ఇది కూడా చదవండి:దీపావళికి ఫిట్‌గా కనిపించాలంటే... తక్కువ రోజుల్లో 2-4 కేజీల బరువుని ఇలా తగ్గించుకోండి!!

Advertisment
తాజా కథనాలు