Drugs: హైదరాబాద్‌లో రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్‌ సీజ్

హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. జీడిమెట్ల పరిధిలో 220 కేజీల ఎఫిడ్రిన్ అనే డ్రగ్స్‌ను ఈగల్ టీమ్ స్వాధీనం చేసుకుంది. వీటి విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

New Update
drugs worth 10 crores seized in hyderabad

drugs worth 10 crores seized in hyderabad

హైదరాబాద్‌(hyderabad)ను డ్రగ్స్‌ ఫ్రీ సిటీ(Drugs Free City)గా చేయాలని పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న అవి ఫలించడం లేదు. ఎక్కడో ఓ చోట డ్రగ్స్‌ దందాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి(drugs-seized). జీడిమెట్ల పరిధిలోని స్ర్పింగ్ ఫీల్డ్‌ కాలనీలోని సాయి దత్తా రెసిడెన్సీలో ఏకంగా 220 కేజీల ఎఫిడ్రిన్ అనే డ్రగ్స్‌ను ఈగల్ టీమ్ స్వాధీనం చేసుకుంది. వీటి విలువ దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. 

Also Read: మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

Drugs Seized In Hyderabad

ఓ అపార్ట్‌మెంట్‌లో అయిదుగురు వ్యక్తులు కలిసి ఈ డ్రగ్స్‌ను తయారీ చేస్తున్నట్లు ఈగల్‌ టీమ్‌కు పక్కా సమాచారం అందింది. దీంతో సోదాలు నిర్వహించగా భారీగా డ్రగ్స్‌ పట్టుబట్టాయి. ఈ ఘటనలో నలుగురిని పోలీసలు అరెస్టు చేశారు. మరొకరు పరారయ్యారు. ఈ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.70 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

Also Read: వరకట్న వేధింపులు ?.. భార్యను చంపి మంచం కింద దాచిపెట్టిన భర్త

డ్రగ్స్‌ తయారు చేస్తున్న నిందుతులను వాస్తవాయి శివరామకృష్ణ పరమ వర్మ, దంగేటి అనిల్‌, మద్దు వెంకట కృష్ణ, ఎం ప్రసాద్‌, ముసిని దొరబాబులుగా గుర్తించారు. వీళ్లందరూ కూడా ఏపీలోని కాకినాడ, నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలకు చెందినవారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఉంటూ ఈ డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నారని వెల్లడించారు. 

Also Read: వరల్డ్ టాప్ హండ్రెడ్ లో భారత యూనివర్శిటీలకు దక్కని చోటు..పధ్నాలుగేళ్ళల్లో ఇదే మొదటిసారి

Advertisment
తాజా కథనాలు