Italy: ఆ దేశంలో బురఖా, నిఖాబ్ ధరించకూడదు..ప్రభుత్వ సంచలన నిర్ణయం

బహిరంగ ప్రదేశాల్లో మహిళలు బురఖాలు, నిఖాబ్ లు ధరించకూడదనే నిషేధానికి ఇటలీ ప్రభుత్వం ప్రతిపాదన చేసింది. ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించింది. 

New Update
Italy

ఇటలీలో ఇక మీదట బహిరంగ ప్రదేశాల్లో బురఖాలు, నిఖాబ్ లు ధరిస్తే భారీ జరిమానాలు విధిస్తారు. దీనికి సంబంధించిన బిల్లును ఇప్పటికే అక్కడ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇస్లామిక్ వేర్పాటువాదాన్ని ఎదుర్కోవడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించామని ఇటలీ గవర్నమెంట్ తెలిపింది. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి 300 యూరోస్ నుంచి 3,000 యూరోస్ అంటే భారత కరెన్సీ ప్రకారం రూ.30,000 నుంచి రూ.3 లక్షల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది.

బురఖా ధరిస్తే జరిమానా తప్పదు..

ఇటలీలో ఇప్పటికే ముస్లిం మతానికి వ్యతిరేకంగా చాలా నిర్ణయాలు తీసుకున్నారు. రీసెంట్ గా పాలస్తీనాకు అక్కడి ప్రభుత్వం మద్దతును కూడా ఉపసంహరించుకుంది. దీనిపై ఇటలీలో తీవ్ర నిరసనలు చెలరేగాయి. ఆందోళనలు జరిగాయి కూడా. దానికి తోడు ఇప్పుడు ఇస్లామిక్ సంస్కృతి, దీని వేర్పాటు వాదానికి వ్యతిరేకంగా బిల్లును తీసుకువస్తోంది ఇటలీ ప్రభుత్వం. ఈ కొత్త బిల్లులో కేవలం బురఖా, నిఖాబ్‌లపై నిషేధం మాత్రమే కాకుండా, మతపరమైన అంశాలకు సంబంధించిన అనేక ఇతర కఠిన నిబంధనలు కూడా ఉన్నాయి. స్కూళ్ళు, యూనివర్శిటీలు, షాప్స్, ఆఫీసులతో సహ బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడా బురఖాలను ధరించకూడదు. అలాగే మసీదులకు అందుతున్న నిధుల విషయంలో పూర్తి పారదర్శకత పాటించాలని కూడా ఈ ముసాయిదా చట్టంలో ఉంది. వీటన్నిటితో పాటూ మత సంస్థలకు వచ్చే విదేశీ విరాళాల పైన కూడా ఆంక్షలు విధించనున్నారు. 

కన్యత్వ పరీక్షలు, మతాంతర వివాహాల్లో బలవంతానికి పాల్పడే వారిపై కూడా చర్యలు తీసుకునేందుకు వీలుగా కొత్త చట్టాన్ని రూపొందించారు. ముఖ్యంగా ఇటలీ ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందని మత సంస్థల ఆర్థిక కార్యకలాపాలపై నిఘా ఉంచుతారు.  ప్రస్తుతం ఇటలీలో ఏ ఒక్క ముస్లిం సంస్థ కూడా ప్రభుత్వ గుర్తింపు పొందలేదు. కొత్త చట్టం ప్రకారం వీటిపై త్వరలోనే చర్యలు తీసుకుంటారు. ఈ బిల్లుకు ప్రధాని జార్జియా మెలోనీ ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తోంది. దాదాపు ఇది పాస్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే మరోవైపు ఇటలీలో ఈ బిల్లుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ముస్లిం వర్గాలు ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీని వలన ముస్లిలంను ఇతరుల నుంచి దూరం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.       

Also Read: UK Universities: భారత్‌లో 9 యూకే యూనివర్శిటీల క్యాంపస్‌ల ఏర్పాటు..ప్రధాని మోదీ

Advertisment
తాజా కథనాలు