/rtv/media/media_files/2025/10/04/out-of-stock-2025-10-04-08-25-22.jpg)
భారీ ఆఫర్లతో కూడిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ అంటే వినియోగదారులకు పండగే. ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్‌లు, స్మార్ట్ టీవీలు వంటి ఖరీదైన ఉత్పత్తులు అతి తక్కువ ధరలకు లభిస్తాయి. అంత తక్కువ ధరకు వస్తే ఎవరైనా వదులుకుంటారా చెప్పండి. కళ్ల ముందు ఫుల్ మీల్స్ ఉన్నా తినలేని పరిస్థితి లాంటిది ఔట్ ఆఫ్ స్టాక్. అత్యంత ఆకర్షణీయమైన డీల్స్‌లో ఉండే ఈ వస్తువులు సెకన్లలోనే 'అవుట్ ఆఫ్ స్టాక్' (స్టాక్ అయిపోయింది) అని కనిపించడం చాలా మందికి నిరాశ కలిగిస్తుంది. లిమిటెడ్ స్టాక్, అధిక డిమాండ్ కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుంది.
అయితే, ఈ 'అవుట్ ఆఫ్ స్టాక్' సమస్యను అధిగమించడానికి, మీకు ఇష్టమైన ఐఫోన్ లేదా ఇతర ప్రాడక్ట్స్ సక్సెస్ ఫుల్‌గా కొనుగోలు చేయడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం:
1.ఎక్స్‌క్లూజివ్ మెంబర్‌షిప్ తీసుకోండి
ఫ్లిప్‌కార్ట్ (ప్లస్ మెంబర్‌షిప్), అమెజాన్ (ప్రైమ్ మెంబర్‌షిప్) వంటి ప్లాట్‌ఫామ్‌లు తమ ప్రీమియం సభ్యులకు సేల్ ప్రారంభానికి కొన్ని గంటల ముందు 'ఎర్లీ యాక్సెస్' (ముందస్తు కొనుగోలు అవకాశం) కల్పిస్తాయి. అత్యంత ఆకర్షణీయమైన డీల్స్ ఉన్న ఉత్పత్తులు వేగంగా అమ్ముడుపోయే ముందు, ఈ ముందస్తు యాక్సెస్ ద్వారా మీరు కొనుగోలు చేయవచ్చు.
2. అడ్రస్, పేమెంట్ వివరాలు రెడీగా ఉంచుకోవాలి
సేల్ ప్రారంభానికి ముందే మీ షిప్పింగ్ అడ్రస్, క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా UPI వివరాలను అకౌంట్‌లో సేవ్ చేసి ఉంచండి. 'అవుట్ ఆఫ్ స్టాక్' అయ్యే ఉత్పత్తులను కొనేటప్పుడు ప్రతి సెకను కీలకం. వివరాలు నింపడానికి సమయం వృథా చేయకుండా, నేరుగా ఆర్డర్ ప్లేస్ చేసేందుకు ఇది సహాయపడుతుంది.
3. 'విష్‌లిస్ట్' లేదా 'కార్ట్'లో ఉంచండి:
మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఐఫోన్ మోడల్, రంగు మరియు స్టోరేజ్ వేరియంట్‌ను ముందుగానే 'విష్‌లిస్ట్' లేదా 'కార్ట్'లో చేర్చండి. సేల్ మొదలవగానే, నేరుగా కార్ట్ నుంచి పేమెంట్ ప్రక్రియను ప్రారంభించడం ద్వారా సమయం ఆదా అవుతుంది.
4. స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్
మీ ఇంటర్నెట్ కనెక్షన్ వేగంగా ఉంటే, వెబ్‌సైట్ లేదా యాప్‌లో పేజీలు వేగంగా లోడ్ అవుతాయి. ముఖ్యంగా 'ఫ్లాష్ సేల్' లేదా ఐఫోన్‌లపై భారీ డిస్కౌంట్లు ఉండే సమయంలో వేగవంతమైన కనెక్షన్ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది.
5. సేల్ ప్రారంభ సమయానికి సిద్ధంగా ఉండండి:
డీల్ ఎప్పుడు మొదలవుతుందో ఖచ్చితంగా తెలుసుకుని, దానికి కనీసం 5 నిమిషాల ముందుగా మొబైల్ యాప్‌లో లాగిన్ అయి సిద్ధంగా ఉండండి. సేల్ మొదలైన వెంటనే వెంటనే 'బై నౌ' (Buy Now) బటన్ నొక్కండి. ఒకవేళ 'అవుట్ ఆఫ్ స్టాక్' అని చూపించినా, కొద్ది సెకన్లు లేదా నిమిషాలు వేచి ఉండి పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి. కొందరు వినియోగదారులు ఆర్డర్‌ను రద్దు చేయడం వల్ల స్టాక్ మళ్లీ కనిపించే అవకాశం ఉంటుంది.
ఈ చిట్కాలను పాటించడం ద్వారా, పండుగ సేల్స్‌లో మీకు నచ్చిన ఐఫోన్ లేదా ఇతర వస్తువులను తక్కువ ధరలకే దక్కించుకునే అవకాశం ఉంది. ఈ టిప్స్ పాటించి దసరా ఆఫర్లు మిస్ అయినా.. దివాలీ ఆఫర్లు మాత్రం మిస్ అవ్వకుండా చూసుకోండి.