జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో విషాదం
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. స్థానిక దుబ్బాకవాడలో నివాసం ఉంటున్న లక్ష్మి-రాజు కమారుడు శివను మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని వ్యక్తులు బైక్పై ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
రిటైర్డ్ ఆర్మీ జవాన్ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా ఊరిలో వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబంతో జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. హఠాత్తుగా ఇంటి నుంచి వెళ్లిపోయి చివరకు తన వ్యవసాయ బావిలోనే శవమై తేలాడు.