/rtv/media/media_files/2025/06/08/4tCRfQKCYvgsHrDSbnr3.jpg)
Minister Konda Surekha
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏడాదిన్నరగా ఊరిస్తున్న మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు ఈ రోజు పూర్తయ్యింది. అయితే ఈ విస్తరణలో కేవలం మూడు ఖాళీలను మాత్రమే హైకమాండ్ భర్తీ చేసింది. మరో మూడు ఖాళీలను అలాగే ఉంచింది. ఏడాది తర్వాత చేపట్టనున్న విస్తరణలో మరో ముగ్గురికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందన్న చర్చ సాగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ మంత్రివర్గ విస్తరణపై కొండా సురేఖ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ చర్చ జరిగినా.. కొండా సురేఖను తప్పకుండా తప్పిస్తారన్న అంశం తెరపైకి వచ్చేది. ఆమె స్థానంలో మరో బీసీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లేదా.. ఎమ్మెల్సీ విజయశాంతికి ఛాన్స్ వస్తుందన్న విశ్లేషణలు సైతం వినిపించాయి.
Also Read : మహిళా న్యాయమూర్తి మంగళసూత్రం చోరీ..
కానీ, కొండా సురేఖను తప్పించకుండానే కేబినెట్ విస్తరణను పూర్తి చేశారు సీఎం రేవంత్. బీసీ మహిళ అయిన సురేఖను తప్పిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని హైకమాండ్ తో పాటు సీఎం రేవంత్ భావించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మరో ఏడాది తర్వాత ప్రస్తుత మంత్రుల పనితీరు ఆధారంగా భారీ మార్పులు చేర్పులు చేసి ఎన్నికల కేబినెట్ ను రూపొందించాలన్నది హైకమాండ్ ఆలోచన అని చర్చ సాగుతోంది. అప్పటి వరకు పని తీరు మెరుగు పడితే సురేఖ కొనసాగుతారని.. లేకపోతే ఆమె పదవికి గండం తప్పదని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : షర్ట్ బటన్ తీసేసి.. 'టాక్సీ వాలా' బ్యూటీ గ్లామర్ షో! ఫొటోలు చూశారా
Also Read : సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!
అనేక విభేదాలు..
అక్కినేని నాగ చైతన్య-సమంత విడాకులపై సురేఖ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా మారాయన్న చర్చ ఉంది. హైకమాండ్ కూడా ఆమెపై సీరియస్ అయినట్లు వార్తలు వచ్చాయి. అది జరిగిన కొన్ని రోజులకే ఆమె ఓ పోలీస్ స్టేషన్ కు వెళ్లి హల్ చల్ చేసిన వీడియో కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ వీడియో ప్రతిపక్షాలకు అస్త్రంగా కూడా మారింది. అనంతరం సొంత జిల్లా వరంగల్ కు చెందిన ఎమ్మెల్యేలు సురేఖ తమ నియోజకవర్గాల్లో వేలు పెడుతుందని హైకమాండ్ కు కంప్లైట్ చేశారు. ఇటీవల మంత్రులు సాధారణంగా కాంట్రాక్టర్ల నుంచి పర్సంటేజ్ తీసుకుంటారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా ప్రభుత్వానికి ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలో ఆమె మంత్రి పదవి పోవడం ఖాయమన్న చర్చ సాగింది. కానీ ప్రస్తుత విస్తరణలో ఎలాంటి తొలగింపులు లేకపోవడంతో సురేఖ ఊపిరి పీల్చుకున్నారు. మా మేడం పదవి సేఫ్.. అంటూ ఆమె అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read : షియోమి Vs వివో.. ఈ రెండు ఫోన్లలో ఏది బెటర్!
telugu breaking news | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news | konda-surekha | congress