/rtv/media/media_files/2025/06/08/18SEivXRXwh9xiVVXmG3.jpg)
Xiaomi 15 vs Vivo X200s
ఇటీవల షియోమి తన Xiaomi 15 ఫోన్‌ని, వివో తన Vivo X200s ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేశాయి. ఈ రెండు ఫోన్లు పవర్ ఫుల్ స్పెసిఫికేషన్లను కలిగి ఉన్నాయి. అందువల్ల ఈ రెండు మొబైళ్లలో ఏదో ఒక దాన్ని కొనుక్కోవాలని చూస్తున్నట్లయితే.. ఇందులో ఏది బెటర్ ఫీచర్లను కలిగి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. Vivo X200s లో ఆక్టా కోర్ MediaTek Dimensity 9400+ 3nm ప్రాసెసర్ ఉంది. అదే సమయంలో Xiaomi 15 లో ఆక్టా కోర్ Qualcomm Snapdragon 8 Elite ప్రాసెసర్ అందించారు.
Also Read : అనంతపురంలో ఇంటర్ విద్యార్థినీ దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు
ధర
Xiaomi 15 ఒకే వేరియంట్లలో వచ్చింది. దీని 12GB + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 64,999గా కంపెనీ నిర్ణయించింది.
అదే సమయంలో Vivo X200s ఫోన్ 12GB + 256GB వేరియంట్ ధర సుమారు రూ. 49,115 గా ఉంది.
ఆపరేటింగ్ సిస్టమ్
Xiaomi 15 ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Xiaomi HyperOS 2లో పనిచేస్తుంది.
అదే సమయంలో Vivo X200s ఆండ్రాయిడ్ 15 ఆధారంగా Funtouch OS 15లో కూడా పనిచేస్తుంది.
Also Read : ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి
డిస్ప్లే
Xiaomi 15 ఫోన్ 6.36-అంగుళాల క్రిస్టల్ రేస్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. దీని రిజల్యూషన్ 2670 x 1200 పిక్సెల్‌లుగా ఉంది. ఇది 1-120Hz రిఫ్రెష్ రేట్చ, 3,200 nits పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంది.
అదే సమయంలో Vivo X200s ఫోన్ 6.67-అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. ఇది 2800×1260 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 2160Hz హై ఫ్రీక్వెన్సీ PWM డిమ్మింగ్, 5000 nits వరకు పీక్ బ్రైట్నెస్ను వస్తుంది.
ప్రాసెసర్
Xiaomi 15 ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంది.
Vivo X200s లో ఆక్టా కోర్ MediaTek Dimensity 9400+ 3nm ప్రాసెసర్, Immortalis-G925 GPU ఉన్నాయి.
కెమెరా
Xiaomi 15 ఫోన్ వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ లైకా ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ లైకా 60mm ఫ్లోటింగ్ టెలిఫోటో కెమెరా, 50-మెగాపిక్సెల్ లైకా అల్ట్రా-వైడ్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.
Also Read: మద్యం తాగడం అనే పొరపాటు చేయకండి! మీ కాలేయం పాడైపోతుంది.. ఫ్రూఫ్ ఇదే!
Vivo X200s వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ సోనీ IMX921 ప్రైమరీ కెమెరా, 50-మెగాపిక్సెల్ Samsung JN1 అల్ట్రా-వైడ్ కెమెరా, 50-మెగాపిక్సెల్ 3X పెరిస్కోప్ టెలిఫోటో సోనీ IMX882 కెమెరా ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాల్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
బ్యాటరీ బ్యాకప్
షియోమి 15లో 5,240mAh బ్యాటరీ ఉంది. ఇది 90W వైర్డు, 50W వైర్లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
అదే సమయంలో వివో X200sలో 6200mAh బ్యాటరీ ఉంది. ఇది 90W ఫాస్ట్, 40W వైర్లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది.
tech-news | telugu tech news