/rtv/media/media_files/2025/03/25/xPGfNRFToaFTP5MMWU5a.jpg)
Telangana 'Vehicle Location Tracking Device' in public transport vehicles
తెలంగాణ ప్రభుత్వం మహిళలకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై రాత్రి వేళ క్యాబ్‌లు, ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణంపై రవాణాశాఖ దృష్టి సారించింది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే మహిళలు.. ఎలాంటి భయం లేకుండా నిర్భయంగా రాత్రిళ్లు కూడా ప్రయాణించేందుకు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రైవేటు ప్రజా రవాణా బస్సులు, క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లలో ‘వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్’లను తప్పనిసరి చేసింది. మహిళలు క్యాబ్ లేదా ప్రైవేట్ బస్సు ఎక్కినప్పుడు ఇబ్బందులు ఎదురైతే.. అందులో ఉండే ఒక్క బటన్ నొక్కితే చాలు.. క్షణాల్లో పోలీసులు ప్రత్యక్షమవుతారు.
Also Read : సెలబ్రిటీలకు 72 గంటలే టైం.. సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్!
నిర్భయ చట్టం ప్రకారం..
ఈ మేరకు నిర్భయ చట్టం ప్రకారం కొత్తగా నమోదయ్యే వాహనాలతో పాటు, పాత వాటిలోనూ ఈ పరికరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీని ద్వారా మహిళలకు సురక్షితమైన ప్రయాణం కలుగుతుందని భావిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటికే వెహికల్ ట్రాకింగ్ విధానం అమలవుతోంది. ఈ క్రమంలోనే త్వరలో ప్రైవేట్ ప్రజా రవాణా వాహనాల్లో కూడా ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఇలాంటి వ్యవస్థ ఏర్పాటుచేయాలని నిర్భయ చట్టంలోనే స్పష్టంగా ప్రతిపాదించారు కానీ అది అమల్లోకి రాలేదు. దీంతో మహిళా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది.
Also Read : ఒకే సినిమాలో పూజా, మృణాల్.. ఫ్యాన్స్ కి పండగే!
కంట్రోల్ రూమ్‌కు అలర్ట్..
ఈ క్రమంలోనే ట్రాకింగ్ పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. మహిళలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు ప్యానిక్ బటన్ నొక్కితే చాలు.. వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు అలర్ట్ వెళ్తుంది. దీంతో వెంటనే పోలీసులు.. లొకేషన్ ఆధారంగా వాహనం వద్దకు చేరుకుంటారు. ప్రైవేటు వాహనాలన్నింటిలోనూ వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్లతో పాటు అత్యవసర సమయంలో సమాచారం ఇచ్చేందుకు ప్యానిక్ బటన్ ఉంటుంది. ఈ వాహనాలను పర్యవేక్షించేందుకు రవాణా కమిషనర్ కార్యాలయంలో ఒక ప్రత్యేక కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. ప్రతి వాహనం కదలికలు తెలుసుకొనేందుకు వీలుగా అన్ని రకాల ప్రజారవాణా వాహనాలను పోలీస్ కంట్రోల్ రూమ్ అనుసంధానం చేస్తారు.
Also Read: యూట్యూబర్ VR రాజాపై అన్వేష్ ఫైర్.. గడ్డి తింటున్నారంటూ ఆగ్రహం!
మహిళలకు ప్రయాణంలో వేధింపులు ఎదురైతే ప్యానిక్ బటన్ నొక్కగానే.. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఎమర్జెన్సీ అలర్ట్ వెళ్తుంది. వాహనం లొకేషన్ ఆధారంగా పోలీసులను అలర్ట్ చేస్తారు. వెంటనే లోకల్ పోలీసులు వాహనం వద్దకు చేరుకొని బాధితులను రక్షించే చర్యలు చేపడతారు. రవాణ శాఖ తీసుకోస్తున్న ఈ వ్యవస్థతో డ్రైవర్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నాడా? లేదా? అనే విషయం కూడా తెలిసిపోతుంది. దీంతోపాటు ఎవరైనా ట్రాకింగ్ డివైజ్‌ను ఏర్పాటు చేసుకుపోతే.. ఆ వాహనాలను సీజ్ చేస్తారు. జరిమానా విధిస్తారు. మొత్తంగా మహిళల ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్కార్ చర్యలు చేపడుతోంది.
Also Read: వైలెన్స్, లవ్, యాక్షన్, డ్రామా.. సల్మాన్ ఖాన్ 'సికందర్' ట్రైలర్ భలే ఉంది!
road transport department | telangana | cm-revanth-reddy | today telugu news | latest telangana news | telangana news today | telangana-news-updates | latest-telugu-news | today-news-in-telugu