Varun Dhawan: ఒకే సినిమాలో పూజా, మృణాల్.. ఫ్యాన్స్ కి పండగే!

వ‌రుణ్ ధావ‌న్ హీరోగా బాలీవుడ్ లో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ "హై జవానీ తో ఇష్క్ హోనా హై" మూవీలో హీరోయిన్లుగా పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ మెరవబోతున్నారు. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, వ‌రుణ్ ధావ‌న్ తండ్రి డేవిడ్ ధావన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.

New Update
Varun Dhawan

Varun Dhawan

Varun Dhawan: వ‌రుణ్ ధావ‌న్ హీరోగా బాలీవుడ్ లో రాబోతున్న రొమాంటిక్ కామెడీ "హై జవానీ తో ఇష్క్ హోనా హై" మూవీలోహీరోయిన్లుగా పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ మెరవబోతున్నారు. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ శనివారం రిషికేష్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఈ మూవీకి ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, వ‌రుణ్ ధావ‌న్ తండ్రైన డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read: USA: యెమెన్ పై అమెరికా దాడులు..వందల మంది మృతి

కాగా ఈ రొమాంటిక్, కామెడీ సినిమా లాంచింగ్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రిషికేష్‌లో గంగా హారతిలో హీరోయిన్ పూజా హెగ్డే , హీరో వ‌రుణ్ ధావ‌న్ పాల్గొన్నారు.

Also Read: Cinema: రాబిన్ హుడ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో డాన్స్ తో అదరగొట్టిన వార్నర్

4 తమిళ చిత్రాలతో ఫుల్ బిజీ..

పూజా ప్రస్తుతం 4 తమిళ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ దూసుకెళ్తోంది. విజయ్ లాస్ట్ మూవీగా అనౌన్స్ చేసిన  "జననాయకన్", రాఘవ లారెన్స్  "కాంచన 4"తో పాటు సూర్య హీరోగా రూపొందుతున్న "రెట్రో"లో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక రజనీకాంత్‌తో "కూలీ" సినిమాలో స్పెష‌ల్ సాంగ్ లో కూడా చిందులేయనుంది.

Also Read: బంగారం ధరించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

Also Read: తెలంగాణలో మరో ఎన్నికకు మోగిన నగారా.. షెడ్యూల్ విడుదల!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు