TGSRTC: భారీ లాభాల్లో తెలంగాణ ఆర్టీసీ.. రూ.1,008.79 కోట్ల ఆదాయం!

తెలంగాణ ఆర్టీసీ భారీ లాభాల బాట పట్టింది. 'మహాలక్ష్మి' పథకంతో ప్రయాణికుల సగటు 45.49 నుంచి 59.10 లక్షలు పెరిగింది. 2024-25లో రూ.529.20 కోట్ల లాభాలు రాగా.. 2025-26లో రూ.1,008.79 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 

New Update
TSRTC: టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో డీఏ ప్రకటించిన ఆర్టీసీ యాజమాన్యం..

తెలంగాణ ఆర్టీసీ భారీ లాభాల బాట పట్టినట్లు అధికారులు చెబుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుల్లో ఉన్న రోడ్డు రవాణా సంస్థకు భారీ ఆదాయం చేకూరుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'మహాలక్ష్మి' పథకం అమలుతో గత రెండేళ్లుగా మహిళలకు ‘జీరో’ టికెట్లు ఇస్తోంది. 2023 డిసెంబరు 9 నుంచి ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండగా.. వారికి ఛార్జీల మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తోంది. అయితే గత ప్రభుత్వంలో రోజువారీ ప్రయాణికుల సగటు 45.49 లక్షలు ఉండగా మహాలక్ష్మి పథకంతో 59.10 లక్షలు పెరిగినట్లు వెల్లడించారు. 

Also Read :  నేను కేసీఆర్ అంత మంచోడిని కాదు : KTR

రూ.1,008.79 కోట్ల లాభాలు..

ఈ మేరకు ఇటీవల ఈ సంఖ్య 13.61 లక్షలు దాటినట్లు తెలిపారు. దీంతో ఆర్టీసీ గత, ప్రస్తుత ఆర్థిక సంవత్సరాల్లో లాభాలబాట పట్టిందని, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.104.11 కోట్లు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. 2024-25లో జనవరి నాటికి రూ.529.20 కోట్ల లాభాలు రాగా.. ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.709.29 కోట్లు రానున్నట్లు అంచనా వేస్తున్నారు. 2025-26లో రూ.1,008.79 కోట్ల లాభాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. 

Also read :  తల్లి డైరెక్షన్‌..కొడుకులు యాక్షన్‌.. షేక్​ పేట చోరీ కేసులో బిగ్‌ట్విస్ట్‌

మరోవైపు బడ్జెట్‌లో రవాణాశాఖ పద్దులపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. సంస్థ సాధించిన ఫలితాలను, రానున్న ఆర్థిక సంవత్సరం లక్ష్యాల్ని రవాణాశాఖ వెల్లడించినట్లు తెలిపారు. ఇక 2025 ఫిబ్రవరి 28 నాటికి సంస్థ చెల్లించాల్సిన బకాయిలు రూ.9,897.55 కోట్లు ఉండగా.. ఇందులో బ్యాంకు రుణాలు రూ.2,719.71 కోట్లు ఉన్నాయన్నారు. ఉద్యోగులకు రూ.7,177.84 కోట్లు చెల్లించాల్సినవిగా పేర్కొన్నారు. 
గతంలో మొత్తం ఆర్టీసీకి రూ.10,327.89 కోట్ల నష్టాలు వాటిల్లినట్లు వెల్లడించారు. 

Also read :  గువాహటి ఐఐటీ పరిశోధకుల అద్బుతం.. అంతర్జాతీయ సరిహద్దులపై రోబోల నిఘా !

Also Read :  జైలు భోజనం వద్దు.. డ్రగ్స్ కావాలని సాహిల్ డిమాండ్

latest-telugu-news | today telugu news | mahalaxmi-scheme | tickets | tgsrtc-bus | latest telangana news | telangana-news-updates | telangana news today

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు