/rtv/media/media_files/2025/05/20/oQL7YdDDOyfmb5aoszCW.jpg)
Telangana Raj Bhavan Files and hard disks missing
TG RajBhavan: తెలంగాణ రాజ్‌భవన్‌లో దొంగలుపడ్డారు. సుధర్మభవన్‌లో మే 14న కీలకమైన రిపోర్టులు, ఫైల్స్, 4 హార్డ్ డిస్క్‌లు ఎత్తుకెళ్లారు. సీసీ రాజ్ భవన్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయగా CC ఫుటేజీ ఆధారంగా దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న ఓ గదిలో ఈ చోరీ జరిగగా.. దుండగులు హెల్మెట్‌తో కంప్యూటర్ రూమ్‌లోకి వెళ్లినట్లు గుర్తించారు. అయితే ఈ పని ఎవరు చేశారనేది ఉత్కంఠగా మారింది. తెలిసిన వారే చేయించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : రీతూ వర్మ రొమాంటిక్ థ్రిల్లర్.. ట్రైలర్ ఇక్కడ చూడండి!
Also Read : తాత మెచ్చిన మనవడు.. నేడు తారక్ 42వ పుట్టిన రోజు
Telangana Raj Bhavan Files And Hard Disks Missing
ఈ ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారగా.. ఈ హార్డ్‌డిస్క్‌ల్లో రాజ్‌భవన్‌లో జరిగే కీలక సమావేశాలు, ప్రభుత్వ నిర్ణయాలు, ఇతర సున్నితమైన సమాచారం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ డేటా మాయం మాయమైతే ప్రభుత్వంపై తీవ్ర ప్రభావం పడే ఛాన్స్ ఉంది. అయితే కంప్యూటర్ హార్డ్‌వేర్ ఇంజినీర్ శ్రీనివాస్ ఈ దొంగతనానికి పాల్పడట్లు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
Also Read : రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు అంగీకారం..ట్రంప్
Also Read : తాను పోయింది...లక్నోను తీసుకెళ్ళిపోయింది
telugu-news | today telugu news