ఆర్టీసీ కార్మికుల చలో రాజ్‌భవన్.. ఏం జరుగుతుందోనని సర్వత్రా టెన్షన్..!
చలో రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఆ దశగా వేగంగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుకు కార్మికులు భారీగా చేరుకున్నారు. అటు పోలీసులు మాత్రం ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లును ఇప్పటివరకు గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడం పట్ల కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు.