Ganesh Fest: గణేశ్‌ మండపాన్ని పెడుతున్నారా ? ఈ రూల్స్‌ తప్పకుండా పాటించాల్సిందే

ఆగస్టు 27న వినాయక నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పల్లెలు, పట్టణాలు, నగరాల్లో వినాయకుడి మండపాల ఏర్పాట్ల పనుల్లో యువత నిమగ్నమైపోయారు. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

New Update
telangana- police -issued -guidelines- for -ganesh festival

telangana police issued guidelines for ganesh festival

ఆగస్టు 27న వినాయక నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పల్లెలు, పట్టణాలు, నగరాల్లో వినాయకుడి మండపాల ఏర్పాట్ల పనుల్లో యువత నిమగ్నమైపోయారు. ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వినాయక మండపాల నిర్వహకులు కొన్ని రూల్స్‌ పాటించాలని సూచించారు. మండపాలు ఏర్పాటు చేయడం, నవరాత్రుల నిర్వహణ, విగ్రహాలను తరలించడం, నిమజ్జనం లాంటి సమయాల్లో కచ్చితంగా పలు నిబంధనలు పాటించాలని ఆదేశించారు. 

Also Read: అనిల్‌ అంబానీకి మరో ఎదురుదెబ్బ.. రూ.2929 కోట్ల బ్యాంక్ మోసం కేసులో సీబీఐ సోదాలు

వినాయకుని మండపం ఏర్పాటు చేసేందుకు ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసంhttps://policeportal.tspolice.gov.in/index.htm వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకని పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. విద్యుత్‌ కనెక్షన్ కోసం అధికారుల అనుమతి తీసుకోవాలి. మండపాల నిర్మాణ పనులు నిపుణులకు అప్పగించాలి. సొంతంగా విద్యుత్‌ పనులు అస్సలు చేయకూడదు. మండపాల కోసం పూర్తిగా రోడ్లను బ్లాక్‌ చేసి ప్రజలకు అసౌకర్యం కలగించొద్దు. డీజేలకు పర్మిషన్ లేదు. రాత్రి 10 గంటల తర్వాత స్పీకర్స్‌ లేదా మైక్ పెట్టకూడదు. వాటిని వాడేటప్పుడు సౌండ్‌ లెవెల్స్‌ కూడా ప్రభుత్వ నిబంధనల మేరకే ఉంచాలి.    

Also Read: ముంచుకొస్తున్న భారీ వర్షాలు.. మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు

మండపాల వద్ద సీసీకెమెరాలు ఏర్పాటు చేయడం తప్పనిసరి. అలాగే ఫైర్ సేఫ్టీ రూల్స్ పాటించాలి. వర్షాలను కూడా దృష్టిలో పెట్టుకుని భక్తుల రద్దీకి తగ్గట్లు వినాయక మండపాలు ఏర్పాట్లు చేయాలి. వెహికిల్స్ పార్క్ చేసుకునేందుకు కూడా ప్రత్యేకంగా స్థలాలు కేటాయించాలి. ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించకూడదు. ట్రాఫిక్, క్యూలైన్లను నియంత్రించేందుకు మండపాల వద్ద శుభ్రతను పాటించాల్సి ఉంటుంది. పాయింట్ బుక్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మండప నిర్వాహకుల కమిటీ సభ్యుల వివరాలు, కమిటీ ప్రెసిడెంట్/కన్వీనర్/సెక్రటరీ ఎవరో నమోదు చేయాల్సి ఉంటుంది.  

Also Read: కొంత గ్యాప్‌ అంతే.. అదే రిపీట్... రాయితో తల పగలకొట్టి.. భర్తను చంపిన భార్య...

మండపం పరిసర ప్రాంతాల్లో అనుమానస్పద వ్యక్తులు ఎవరైనా తిరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. వినాయకుడి నిమజ్జనం కోసం ప్రభుత్వం/GHMC/పోలీస్ శాఖ సూచించిన అధికారిక నిమజ్జన స్థలాలు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. పోలీసులు ఇచ్చిన పర్మిషన్ కాపీని కూడా మండపంలో అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి. 

Also Read: ప్రేమపేరుతో దగ్గరై..పెళ్లి చేసుకుని దూరమై..యువతి ప్రాణం తీసిన లవ్‌స్టోరీ

Also Read: వాషింగ్టన్ తరువాత షికాగో లో సైనిక మోహరింపు..ఆలోచనలో పెంటగాన్

Advertisment
తాజా కథనాలు