/rtv/media/media_files/2025/04/20/BBZCY0jKzwMEOM7QI0n1.jpg)
Telangana MP Chamala kiran morphing video viral
BIG BREAKING: ప్రభుత్వం, నాయకులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ హైదరాబాద్ పోలీసులకు రెండు అంశాలపై ఫిర్యాదు చేసింది. ఒకటి ప్రభుత్వ సన్న బియ్యం పథకం గురించి ఫేక్ వీడియోస్ వైరల్ అవుతుండగా.. మరొకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కించపరిచే విధంగా మార్ఫింగ్ చేసిన వీడియోపై కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
బ్రేకింగ్ న్యూస్💥
— DIG TV Parody (@DigtvTelugu) April 17, 2025
నా గురించి మాట్లాడడానికి రేవంత్ రెడ్డి గారికి సిగ్గు, శరం ఉండాలి
మొన్న CLP మీటింగ్‌లో చామల కిరణ్ కుమార్ రెడ్డికి క్లాస్ పీకిన రేవంత్ రెడ్డి.. స్పందించిన ఛామల కిరణ్ కుమార్ రెడ్డి
తెలంగాణ ప్రజల డబ్బులు అన్ని దులుపుకొని తీసుకొని పోయి జపాన్‌లో పెడుతుండు… pic.twitter.com/9WG6y0oWXm
సీఎంపై అవమానకరమైన వ్యాఖ్యలు
ఈ మేరకు TPCC మీడియా కోఆర్డినేటర్ కె శ్రీకాంత్ యాదవ్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్, వీడియోలు క్రియేట్ చేసి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించినట్లు గుర్తించారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి.. సీఎం రేవంత్ గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేసినట్లు వీడియో వైరల్ అవుతోంది. సీఎంను తీవ్రంగా విమర్శించినట్లు వీడియోను మార్ఫింగ్ చేయగా దీనిని ఓ ప్రముఖ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం గమనార్హం.
సన్న బియ్యం అని చెప్పి ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారు రేషన్ షాప్స్ లో జరా పైలం 🙏
— Devi Sharma 🇮🇳 (@sarmadevi28) April 13, 2025
గాలిమోటర్ల పోయి నీళ్లు వాటర్ మంత్రి ప్లాస్టిక్ బియ్యం పంపిణి చేసినవి, మిస్టర్ ఏమి ప్రిపేర్ అయ్యి రాలేదు మంత్రి మీ సమాధానం ఏంటి 🤔@UttamINC@KomatireddyKVRpic.twitter.com/zJeQOYdkCt
ప్లాస్టిక్ బియ్యం పంపిణీ..
ఏప్రిల్ 17న పలువురిపై BNS సెక్షన్లు 353(2) (ప్రజా దుశ్చర్యకు దారితీసే ప్రకటనలు), 352 (శాంతికి భంగం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం), 336(4) (ప్రతిష్టకు హాని కలిగించేలా ఫోర్జరీ) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. TPCC సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి కైలాష్ సజ్జన్ మరో ఫిర్యాదు చేశారు. @Sarmadevi28 అనే హ్యాండిల్ లో షేర్ చేసిన వీడియోను పోలీసులకు అందించారు. ఇందులో ప్రభుత్వం ఫైన్ రైస్ పథకం ద్వారా ప్లాస్టిక్ బియ్యాన్ని పంపిణీ చేస్తోందని ప్రచారం చేశారు. ఒక వ్యక్తి బియ్యం నకిలీవని చూపించడానికి స్టవ్‌పై ఉడికించినట్లు కనిపించింది.
Also Read:xAI గ్రోక్‌కి చాట్‌జీపీటీ తరహా మెమరీ ఫీచర్.. ఎలా పనిచేస్తుందంటే..?
ఆ వీడియో, క్యాప్షన్ పూర్తిగా కల్పితమైనవి. ప్రజలను తప్పుదారి పట్టించడానికి, భయాన్ని సృష్టించడానికి ఇలా చేస్తున్నారంటూ సజ్జన్ మండిపడ్డారు. దీనిపై ఏప్రిల్ 16న BNS సెక్షన్లు 353(2), 352 కింద కేసు నమోదు చేయబడింది. నిందితులను గుర్తించడానికి దర్యాప్తు జరుగుతోందని సైబర్ క్రైమ్ ACP RG శివ మారుతి తెలిపారు.
Also Read:అరేయ్ ఏంట్రా ఇది.. సడన్‌గా చూసి నిజం అనుకున్నాం కదరా బాబు..
congress | cm revanth | chamala-kiran-kumar | fake | videos | telugu-news | today telugu news