HYD Rains: మరో 2 గంటల్లో భారీ వర్షం.. ఆ ఏరియాల్లో హైఅలర్ట్!

సాయంత్రం 6 గంటల తర్వాత హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.హైటెక్ సిటీ, కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో 6 తర్వాత భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. వాహనదారులు ఈ మేరకు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని కోరారు.

New Update
Rain

Rain

సాయంత్రం 5 గంటల తర్వాత హైదరాబాద్ లో భారీ వర్షం(Hyd Rains) కురిసే అవకాశం ఉందని సైబరాబాద్ పోలీసులు ప్రకటన విడుదల చేశారు.హైటెక్ సిటీ, కూకట్ పల్లి పరిసర ప్రాంతాల్లో 6 తర్వాత భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. వాహనదారులు ఈ మేరకు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని కోరారు.

ఇది కూడా చదవండి:Rain Alert : 13 నుంచి మరింత భారీ వర్షాలు.. వాతావరణ శాఖ వెల్లడి

ఇంకా పటాన్‌చెరు, ఆర్‌సీ పురం, నార్సింగి, గోల్కొండ, రాజేంద్రనగర్, బండ్లగూడ జాగీర్, శివరాంపల్లి, చంద్రాయణగుట్ట, కతేదాన్, బహదూర్‌గూడా తదితర ప్రాంతాలకు వాతావరణ శాఖ నిపుణులు రెయిన్ అలర్ట్ జారీ చేశారు.  రాబోయే 1-2 గంటల్లో ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Also Read :  బీఆర్ఎస్ కీలక నేత మృతి.. కేసీఆర్ సంతాపం!

ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..

సాయంత్రం, రాత్రి సమయంలో హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయన్నారు. యాదాద్రి - భువనగిరి, నల్గొండ, సిద్దిపేట, జనగాం, మంచిర్యాల, భూపాలపల్లి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్ తదితర జిల్లాల్లోనూ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఆయా జిల్లాల్లో రానున్న 2 గంటల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కొనసాగుతాయన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు.

ఇదిలా ఉంటే.. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 13 - 16 తేదీల మధ్య అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌, ఉమ్మడి నల్గొండ, మెదక్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన జారీ చేసింది. 

గత వారం రోజులుగా తెలంగాణను భారీ వర్షాలు(Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ప్రజలు అవస్థలు పడుతున్నారు. భారీగా ట్రాఫిక్ జామ్ లు అవుతుండడంతో చుక్కలు చూస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా అమీర్ పేట లాంటి ఏరియాల్లో చిన్న వర్షం పడినా రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ ముంపు ప్రాంతాల్లో పర్యటించి.. సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

hyderabad-rain | telugu-news | latest-telugu-news | latest telangana news | telangana weather news | telangana weather updates | telangana-weather-report

Advertisment
తాజా కథనాలు