/rtv/media/media_files/2025/06/15/II0AOFvTrQw7pJQah2tZ.jpg)
Heavy rains
Rain Alert : భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న రాష్ట్రానికి వాతావరణ శాఖ మరో పిడుగులాంటి వార్తా చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. దీంతో ఈ నెల 13 నుంచి 16 వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్గొండ, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో తదితర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
నేడు, రేపు భారీ వానలు
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం నేడు, రేపు (సోమ, మంగళవారాల్లో ) రాష్ర్టంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఈ రోజు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడనున్నాయి. ఆదివారం నిర్మల్ జిల్లా అక్కాపూర్‌లో అత్యధికంగా 11.05 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా ఫణిగిరిలో 8.93, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 7.28, వరంగల్ జిల్లా దుగ్గొండిలో 6.70 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌తో పాటు నారాయణపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాల్లోనూ అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి.
నీట మునిగిన హైదరాబాద్
గత రెండు, మూడు రోజులుగా హైదరాబాద్‌లో వరుసగా వర్షాలు పడుతున్నాయి. సోమవారం కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా. ఇప్పటికే పలు కాలనీల్లో నీరు చేరి ఇళ్లలోకి ప్రవేశించింది. నగరంలోని పలు ప్రాంతాలు ఇప్పటికీ నీళ్లలోనే ఉన్నాయి. రోజు వర్షం కురుస్తుండంతో సహాయక చర్యలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉదయమంతా ఎండతో కూడిన వాతావరణం ఉండి సాయంత్రం అయ్యేసరికి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆఫీసులు ముగిసే సమయంలో ఒక్కసారిగా వర్షం కురుస్తుండంతో రోడ్లపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోతుంది. దీంతో గంటల తరబడి రోడ్లపైనే ఉండిపోవలసి వస్తుందని పలువురు వాపోతున్నారు.
కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో రోడ్లు, వాగులు, వంతెనలు పొంగిపొర్లుతున్నాయి. ఫలితంగా గ్రామాల నుంచి జిల్లా కేంద్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర వైద్య సహాయం అవసరమైన గర్భిణులు, దీర్ఘకాలిక రోగులు, అలాగే సరుకు రవాణా చేసే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్ష కాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. వర్షం పడే ప్రాంతాల్లో అవసరం ఉంటేనే బయటకు వెళ్లండి.తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంటే, మరికొన్ని పాంతాల్లో సరైన వర్షం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో వర్షాదార పంటలు వేసే రైతులకు ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాట్లు వేసిన సరైన వాన లేక వరికి నీరు అందడం లేదంటున్నారు రైతులు.
Also Read : Mega Heroes: అబ్బా ఫ్రేమ్ అదిరింది.. జిమ్ లో మెగా హీరోల రచ్చ! వైరలవుతున్న పిక్