HYDRA: హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు విడుదల!

హైడ్రాకు రేవంత్ సర్కార్ మరింత బలాన్ని చేకూరుస్తోంది. హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు విడుదల చేసింది. కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

author-image
By srinivas
New Update
Hydra: హైడ్రాపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మూడు జోన్లుగా!

Hydra: అక్రమదారుల గుండెల్లో గుబులు రేపుతున్న హైడ్రాకు ప్రభుత్వం మరింత బలాన్ని చేకూరుస్తోంది. మానవ వయరులను కేటాయించడంతోపాటు ఆర్థికంగానూ సపోర్ట్ చేస్తోంది. ఇప్పటికే హైడ్రాకు విస్తృత అధికారాలను కట్టబెడుతూ ప్రత్యేక బిల్లును రూపొందించిన ప్రభుత్వం తాజాగా హైడ్రాకు రూ.50 కోట్ల నిధులు విడుదల చేసింది. కార్యాలయ నిర్వహణ, వాహనాల కొనుగోలుకోసం ఈ నిధులు మంజూరు చేసినట్లు పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై హైడ్రా అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చదవండి: భారత టీవీ ఛానళ్లను బ్యాన్ చేయాలి.. బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్

అక్రమార్కులపై కొరడా.. 

తాజాగా బడంగ్‌పేట అక్రమార్కులపై హైడ్రా కొరడా ఝులిపించింది. అల్మాస్‌గూడ 5వ డివిజన్‌లోని శ్రీ వెంకటేశ్వర కాలనీలో పార్కు స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన కంటైనర్ ను మంగళవారం తెల్లవారుజామున హైడ్రా, మీర్‌పేట్ పోలీసులు సంయుక్తంగా ధ్వంసం చేశారు. చిన్నారులు ఆడుకునే వస్తువులను ఏర్పాటు చేశారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిత్రపటానికి శ్రీ వెంకటేశ్వర కాలనీ వాసులు పాలాభిషేకం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు చెప్పారు.

ఇది కూడా చదవండి: ఆస్ట్రేలియా మీడియాలో బుమ్రా నామస్మరణ.. ఆటగాళ్లు సైతం ఫిదా!

ఇది కూడా చదవండి: ఈసారి యాసంగికి 40 లక్షల ఎకరాల్లో సన్నాల సాగు

ఇది కూడా చదవండి: తల్లికి బంగారం కొనిచ్చేందుకు.. ఏకంగా ఏటీఎంనే కొల్లగొట్టిన కొడుకు?

Advertisment
Advertisment
తాజా కథనాలు