భారత టీవీ ఛానళ్లను బ్యాన్ చేయాలి.. బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్

భారత టీవీ ఛానళ్లను బ్యాన్ చేయాలని కోరుతూ బంగ్లాదేశ్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్ దాఖలైంది. బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని ఓ లాయర్‌ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై వచ్చేవారమే విచారణ జరగనున్నట్లు సమాచారం.

New Update
MEDIA

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అక్కడ హిందువులు, ఇతర మైనార్టీలపై దాడులు జరుగుతుండటం వల్ల పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ నేపథ్యంలోనే భారత్‌కు చెందిన టీవీ ఛానళ్లను బ్యాన్ చేయాలని కోరుతూ అక్కడి హైకోర్టులో రిట్‌ పిటిషన్ దాఖలైంది. ఈ విషయాన్ని అక్కడి వార్తా పత్రికలు వెల్లడించాయి. బంగ్లాదేశ్‌లోని సుప్రీంకోర్టు లాయర్‌ ఈ పిటిషన్ దాఖలు చేశారు. భారత టీవీ ఛానళ్లు బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్నారు.   

Also Read: తల్లికి బంగారం కొనిచ్చేందుకు.. ఏకంగా ఏటీఎంనే కొల్లగొట్టిన కొడుకు?

ఇలా దుష్ప్రచారాలు చేయడం వల్ల ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే ఛాన్స్ ఉందని.. అలాగే బంగ్లాదేశ్‌ సార్వభౌమత్వానికి ముప్పు ఉంటుందని పేర్కొన్నారు. ఈ కేసుపై హైకోర్టులో వచ్చేవారమే విచారణ జరగనున్నట్లు సమాచారం. బంగ్లాదేశ్‌లో హిందువులు జాగ్రత్తగా ఉండాలని ఇస్కాన్‌ కూడా సూచించింది.  

ఇస్కాన్ సభ్యుడు, హిందూ  ఆధ్యాత్మిక నేత చిన్నయ్ కృష్ణదాస్‌ను ఇటీవలే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్ జెండాను అవమానించారని, ఆ తర్వాత తీవ్ర ఉద్రిక్తతలకు కారణం అయ్యారనే ఆరోపణలతో ఆయనపై రాజద్రోహం కింద అరెస్టు చేశారు. ఈ అరెస్టును నిరసిస్తూ బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా హిందూ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ నిరసనల్లో ఓ న్యాయవాది మరణించడంతో ఇస్కాన్‌ను నిషేధించాలని ఓ లాయర్ కోర్టులో పిటిషన్ వేశాడు. కానీ ఈ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఇస్కాన్ కార్యకలాపాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో నివేదిక ఇవ్వాలని అటార్నీ జనరల్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు మీడియా కథనాలు వచ్చాయి.

Also Read: కొండ చరియలు విరిగిపడి ఒకే కుటుంబంలో ఏడుగురు మృతి

దీనివల్ల మరో మార్గంలో ఇస్కాన్‌పై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే చత్తోగ్రామ్‌ జైల్లో ఉన్న చిన్నయ్ కృష్ణదాస్‌కు కలిసేందుకు వెళ్లిన పూజారి శ్మాస్‌దాస్‌ ప్రభును కూడా పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తలకు దారి తీసింది. ఇప్పటికే  ఇస్కాన్‌కు చెందిన 17 బ్యాంకు అకౌంట్లను ప్రభుత్వం నెలరోజుల పాటు ఫ్రీజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో 17 కోట్లకు పైగా జనాభా ఉండగా.. ఇందులో 8 శాతం హిందువులే ఉన్నారు.

 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు