ఈసారి యాసంగికి 40 లక్షల ఎకరాల్లో సన్నాల సాగు

తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్ల సాగుకు భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది. నీటి సౌలభ్యం ఉన్నందున ఈ యాసంగిలో 40 లక్షల ఎకరాల్లో సన్నాలు పండించేందుకు రంగం సిద్దం చేస్తోంది. గతేడాది 54.83 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 15 లక్షల ఎకరాల్లోనే సన్నరకం వరి సాగైంది.

New Update
paddy

తెలంగాణ ప్రభుత్వం సన్న వడ్ల సాగుకు భారీ ఎత్తున ప్లాన్ చేస్తోంది. ఈ యాసంగిలో రైతులు ఎక్కువగా సన్నరకాలే పండించేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖమ చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా 2023 యాసంగిలో 67, 83,358 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. అందులో 54.83 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరి మాత్రమే  పండించారు. గతంతో పోల్చితే ఈసారి నీటి సౌకర్యాలు మెరుగుపడ్డాయి. 75.32 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు వేస్తోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం 2024 యాసంగి 40 లక్షల ఎకరాల్లో సన్నరకం వరి పండించేందుకు రంగం సిద్దం చేస్తోంది.

Also Read: హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్!?

సోనా, బీపీటీ, హెచ్ఎంటీ వంటి వడ్లు..

రైతులు కూడా సన్నవడ్లపై రూ.500 బోనస్ వస్తుందని సన్నాల సాగుకే మొగ్గుచూపుతున్నారు. గతేడాది యాసంగిలో 15 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగయ్యాయి. తెలంగాణ సోనా, బీపీటీ, హెచ్ఎంటీ వంటి వడ్లు ఎక్కువగా పండిచాలని సీఎం రేవంత్ రెడ్డి రైతులకు సూచించారు. ఈ రకాల విత్తనాలు రైతులకు యాసంగిలో అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటుంది. వరి తర్వాత ఎక్కువగా మొక్కజొన్న సాగు చేస్తోంది తెలంగాణ రైతాంగం. 

ఇది కూడా చదవండి: Pushpa 3: బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..'పుష్ప-3' కన్ఫర్మ్,టైటిల్ ఇదే

Also Read: తెలంగాణ ప్రభుత్వ శాఖలో అవినితీ తిమింగలాలు.. రూ.500 కోట్ల స్కామ్

Also Read: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.1.17 లక్షల జీతం!

Advertisment
Advertisment
తాజా కథనాలు