తల్లికి ఇచ్చిన మాటను నెరవేర్చడానికి కొడుకులు ప్రాణాలను కూడా పనంగా పెట్టిన ఘటనలు మనం ఎక్కువగా సినిమాల్లోనే చూస్తుంటాం. అయితే నిజజీవితంలో కూడా ఓ కొడుకు తన తల్లికి ఇచ్చిన మాట కోసం జైలుకి వెళ్లిన ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని బెల్గాంలో ఓ కొడుకు తన తల్లి కోరిక తీర్చేందుకు ఏటీఎంలో డబ్బులు చోరీకి పాల్పడ్డాడు. ఇది కూడా చూడండి: హరీష్ రావుకు బిగ్ షాక్.. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ వారెంట్!? Belgaum, Karnataka: Krishna Suresh Desai, a 23-year-old ATM custodian from Belagavi, stole ₹8.65 lakh from an HDFC ATM. He gifted ₹1.54 lakh worth of gold to his mother and spent the rest. The police recovered ₹5.74 lakh and the gold chain after the theft was caught on CCTV pic.twitter.com/ZhhZUVST8H — IANS (@ians_india) December 3, 2024 ఇది కూడా చూడండి: Ganja:ఈ చాక్లెట్లు తింటే సకల రోగాలు మటు మాయం.. తనిఖీల్లో సంచలన నిజాలు! తల్లికి బంగారం కొనివ్వడానికి.. కృష్ణ సురేష్ దేశాయ్ అనే యువకుడు బెల్గాం జిల్లాలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఔట్‌సోర్స్ పద్ధతిలో వర్క్ చేస్తున్నాడు. తన తల్లికి బంగారం గొలుసు చేయించేందుకు దొంగతనానికి పాల్పడ్డాడు. ఏటీఎం నుంచి రూ.8.65 లక్షలు కొట్టేసి 20 గ్రాముల బంగారు గొలుసును తల్లికి చేయించాడు. ఇది కూడా చూడండి: YCP నాయకుడి దౌర్జన్యం..నగ్న వీడియోలతో బెదిరించి, 2 ఏళ్లు అత్యాచారం! కృష్ణ డబ్బులు కొట్టేసినట్లు సీసీటీవీలో రికార్డు కావడంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కొన్ని గంటల వ్యవధిలోనే పోలీసులు కృష్ణని అరెస్టు చేయడంతో పాటు తల్లికి కొనిచ్చిన బంగారు గొలుసును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తులకు అలర్ట్..భారీ వర్షాలతో క్లోజ్ అయిన పెద్ద పాదం మార్గం!