TG EAPCET Schedule: ఎప్‌సెట్‌, పీజీ ఈసెట్ పరీక్షల షెడ్యూల్‌ ఖరారు..!

తెలంగాణలో ఎప్‌సెట్‌, పీజీ ఈసెట్ పరీక్షల షెడ్యూల్‌ ఖరారైంది. మే 2 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. జూన్ 16 నుంచి 19 వరకు పీజీ ఈసెట్ పరీక్షలు ఉంటాయని ప్రకటించింది.

New Update
TG EACET, PG ECET Exam Schedule Released

TG EACET, PG ECET Exam Schedule Released

TG EAPCET Schedule: తెలంగాణలో ఎప్‌సెట్‌ (TG EAPCET) షెడ్యూల్‌ ఖరారైంది. మే 2 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది. ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఫిబ్రవరి 22 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది.

Also Read: కేసీఆర్ కు బిగ్ షాక్... లీగల్ నోటీసులు పంపిన లాయర్ ఎందుకో తెలుసా....

TG PGECET 2025

మరోవైపు తెలంగాణ పీజీ ఈసెట్(TG PGECET 2025) షెడ్యూల్‌ను కూడా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. జూన్ 16 నుంచి 19వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించింది. మార్చి12న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు పేర్కొంది. మార్చి 17 నుంచి 19వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించేందుకు అవకాశం కల్పించింది. 

Also Read: ఎన్నికల కమిషనర్‌కు బీజేపీ ఆఫర్.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఇదిలాఉండగా.. ఈ ఏడాది నిర్వహించనున్న అన్ని కామన్ ఎంట్రన్స్‌ (CET) పరీక్షల తేదీలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఒకటి కంటే ఎక్కువ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సెట్ పరీక్షల తేదీలు వేరు వేరు తేదీల్లో నిర్వహించేలా ఖరారు చేశారు. 

Also Read: ఎన్డీయే, యూపీఏ ప్రభుత్వాలను కలిపి విమర్శించిన రాహుల్ గాంధీ

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు