Arvind Kejriwal: ఎన్నికల కమిషనర్‌కు బీజేపీ ఆఫర్.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

కేంద్రం ముందు ఈసీ లొంగిపోయి తన స్వతంత్ర ఉనికిని కోల్పోయిందని కేజ్రీవాల్ మండిపడ్డారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌ కుమార్‌కు బీజేపీ గవర్నర్ లేదా రాష్ట్రపతి పదవి ఇస్తానని ఆఫర్ ఇచ్చి ఉంటుందని ఆరోపించారు.

New Update
Arvind Kejriwal

Arvind Kejriwal

మరో రెండ్రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్ పనితీరుపై ఆయన మండిపడ్డారు. కేంద్రం ముందు ఈసీ లొంగిపోయిందని.. ఇది చూస్తుంటే అది తన స్వతంత్ర ఉనికిని పూర్తిగా కోల్పోయినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. ఈ నెల చివర్లో పదవీ విరమణ చేయనున్న ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌కు బీజేపీ ఏ పదవిని ఆఫర్ చేసిందంటూ ప్రశ్నించారు. 

Also Read: పార్లమెంట్ ను కుదిపేసిన కుంభమేళా తొక్కిసలాట

ఆయనకు ఏ గవర్నర్ పదవో లేదా రాష్ట్రపతి పదవో ఇస్తామని బీజేపీ ఆఫర్ ఇచ్చి ఉంటుందని అన్నారు. అందువల్లే పదవీ ఆశత దేశ ప్రజస్వామ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ ఎన్నికల కమిషనర్‌పై కేజ్రీవాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇకనుంచి అయినా వ్యక్తిగత ప్రయోజనాలపై కాకుండా కొన్ని రోజులైనా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ విధులను న్యాయబద్ధంగా నిర్వహించాలని కోరుతున్నామన్నారు.

Also Read: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వందే భారత్‌లో నాన్ వెజ్ నిషేధం

 అలాగే ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ గుండాలు ఆప్‌ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న కూడా ఢిల్లీ పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకనేందుకు భయపడుతున్నారని ఆరోపించారు. తాము ఢిల్లీ ప్రజల కోసం నెలకు రూ.25,000 ఆదా చేస్తుంటే.. ఇతర పార్టీలు ఢిల్లీకి సమస్యలు తెచ్చిపెడుతున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈసారి దేశ రాజధానిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

Also Read: మా సిబ్బంది వారానికి 120 గంటలు పని చేస్తున్నారు.. ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

Also Read: యూఎస్ఏఐడీ పై మండిపడుతున్న ట్రంప్ అండ్‌ మస్క్‌..ఎందుకో తెలుసా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు