Vijay Sethupathi: తమిళంలో పాన్‌ కార్డు మార్చాలి.. స్టార్‌ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?

తమిళ్ హీరో విజయ్ సేతుపతి పాన్ కార్డుకు సంబంధించి కొన్ని మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పాన్ కార్డులోని సమాచారాన్ని, అప్డేట్ లను తమిళంలోనూ అందుబాటులో ఉంచాలని అభ్యర్థించారు.

New Update
Vijay Sethupathi

Vijay Sethupathi

Vijay Sethupathi: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇటీవలే  'విడుదల2'  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 2023లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ‘విడుదల పార్ట్‌ 1’కి కొనసాగింపుగా  వచ్చింది. గతేడాది డిసెంబర్ 30న రిలీజైన  'విడుదల2' పార్ట్ 1 స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.  అయినప్పటికీ థియేటర్స్ వద్ద సినిమాకు మంచి ఆదరణే లభించింది. 

తమిళ్ కూడా యాడ్ చేయండి.. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఓ ఈవెంట్ లో పాల్గొన్న హీరో విజయ్ సేతుపతి పాన్ కార్డుకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. పాన్ కార్డుకు సంబంధించిన సమాచారం, అప్డేట్ లను  తమిళంలోనూ అందుబాటులో ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రస్తుతం పాన్ కార్డు వివరాలు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీని వల్ల ఆ భాషలు అర్థంకాని, రాని ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. తమిళ భాషను పాన్ కార్డులో చేర్చడం కష్టమైనప్పటికీ ప్రయత్నించాలని ప్రభుత్వాన్ని కోరారు విజయ్ సేతుపతి. అందరికీ అర్థమయ్యే భాషలో ఉంటేనే స్పష్టంగా ఉంటుంది. లేకపోతే ప్రజలు గందరగోళానికి గురవుతారు. ఎదుటి వ్యక్తులపై డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది అని తెలిపారు. 

విజయ్ సేతుపతి తెలుగులో బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వచ్చిన ఉప్పెన సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో విలన్ గా నటించిన విజయ్ తొలి పరిచయంలోనే ఆకట్టుకున్నారు. ఇందులో మెగా హీరో వైష్ణవ్ తేజ్, యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. విజయ్ సేతుపతి ఓ వైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్ ప్రాత్రలతోనూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు