/rtv/media/media_files/2025/02/17/KYpj36ARDTIV80xiH32E.jpg)
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ (KCR) కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బర్త్ డే విషెస్ చెప్పారు. " గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు"అంటూ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ సీఎం రేవంత్ (Revanth Reddy) స్వయంగా చేయలేదు కానీ తెలంగాణ సీఎంవో నుంచి ఈ ట్వీట్ వెలువడింది.
Also Read : కుంభమేళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్స్: లిస్ట్ ఇదే!
గజ్వేల్ నియోజకవర్గ శాసనసభ్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు… pic.twitter.com/OTtysLYlya
— Telangana CMO (@TelanganaCMO) February 17, 2025
Also Read : తెలంగాణ ఖచ్చితంగా వస్తుందని కేసీఆర్ ఎలా నమ్మారంటే... ఈ మూడే కారణం!
మంత్రి పొన్నం ప్రభాకర్
మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం కేసీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. " గజ్వేల్ శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు (KCR Birthday Wishes). మీరు ఆరోగ్యంగా, సుఖశాంతులతో దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నాను!" అంటూ ట్వీట్ చేశారు.
గజ్వేల్ శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆరోగ్యంగా, సుఖశాంతులతో దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నాను!@KCRBRSPresident pic.twitter.com/gbpCpEWq7S
— Ponnam Prabhakar (@Ponnam_INC) February 17, 2025
Also Read : కేసీఆర్ పుట్టిన రోజు.. హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్!
హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్
కేసీఆర్ పై ఎమోషనల్ ట్వీట్ చేశారు హరీష్. " మీరు నా తలనిమిరే తల్లిప్రేమ, నాకు ఎనలేని మమకారం పంచిన మేనమామ.. నాకు రాజకీయ చైతన్యాన్ని నేర్పించి, నాలో ప్రజా సేవా సంస్కారాన్ని రంగరించి, నన్ను ఉద్యమ కార్యాచరణలో నడిపించి, నాలోని నాయకత్వ గుణాన్ని ప్రేరేపించి, నాకు పరిపాలనా సామర్థ్యాన్ని కల్పించి, నన్ను చరితార్థుణ్ణి చేసిన మీరు శత వసంతాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ హరీష్ ట్వీట్ చేశారు.
Also Read : ఢిల్లీ భూకంపం .. ప్రజలకు మోదీ కీలక సూచనలు!