Delhi Earthquake: ఢిల్లీ భూకంపం .. ప్రజలకు మోదీ కీలక సూచనలు!

ఢిల్లీ భూ ప్రకంపనలపై స్పందించారు పీఎం మోదీ.  ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. అంతేకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మరోసారి భూప్రకంపనలు వచ్చే సూచనలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

New Update
modi tweet

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భూకంపం అందర్ని ఉలక్కిపడేలా చేసింది. ఉదయం 5:36 గంటలకు బలమైన భూ ప్రకంపనలు సంభవించడంతో గాఢ నిద్రలోఉప్న ప్రజలు ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. ఢిల్లీలో భూమి కంపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ఎక్స్ వేదికగా  తెలిపింది.  కొన్ని సెకన్ల పాటు మాత్రమే  భూమి కంపించడంతో భయాందోళనలకు గురైన జనం ఇళ్లలోంచి  బయటకు పరుగులు తీశారు. ఢిల్లీ భూ ప్రకంపణలతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు.  ఢిల్లీతో పాటుగా నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్ సహా వివిధ ప్రాంతాల్లో భూకంప ప్రకంపనలు సంభవించాయి. 

ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి 

భూ ప్రకంపనలపై రాజకీయ నాయకులు కూడా తమ తమ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఢిల్లీ నగర వాసులకు ధైర్యం చెబుతున్నారు.  తాజాగా పీఎం మోదీ ఢిల్లీ భూ ప్రకంపనలపై ఎక్స్ వేదికగా స్పందించారు.  ప్రతి ఒక్కరూ ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండాలని మోదీ సూచించారు. అంతేకాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మరోసారి భూప్రకంపనలు వచ్చే సూచనలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులు పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నారని మోదీ ట్వీట్ చేశారు.  

ఢిల్లీలో భూకంపం తర్వాత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అతిషి, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజల భద్రత కోసం ఆకాంక్షించారు. ఢిల్లీలో భారీ భూకంపం వచ్చిందని, అంతా క్షేమంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్ధించినట్లు అతిషి పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్ అతిషి పోస్ట్‌ను తిరిగి పోస్ట్ చేసి, 'అందరి భద్రత కోసం నేను ప్రార్థిస్తున్నాను' అని తన ట్వీట్ లో రాసుకొచ్చారు.  

Also Read :   కుంభమేళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్స్: లిస్ట్ ఇదే!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు