HBD KCR :  తెలంగాణ ఖచ్చితంగా వస్తుందని కేసీఆర్ ఎలా నమ్మారంటే... ఈ మూడే కారణం!

2001వ సంవత్సరం నవంబర్ నెలలో ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఏర్పాటు కేసీఆర్కు నమ్మకాన్ని కలిగించాయి. పోరాడితే తెలంగాణ ఏర్పాటు అసాధ్యమేమీ కాదని కేసీఆర్ బలంగా నమ్మారు. అలా 13 ఏళ్ల పాటు పోరాట ఉద్యమం చేసి రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు

New Update
HBD KCR

HBD KCR

కేసీఆర్ (KCR) అంటే కేవలం మూడు అక్షరాలే కాదు.. నాలుగు కోట్ల మంది ప్రజల గుండెచప్పుడు. ప్రత్యేక తెలంగాణకు ఊపిరి ఇచ్చిన వ్యక్తి.  కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఉద్యమాన్ని పరిగెత్తించిన శక్తి.  సుమారుగా 13 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని తన భూజాలపై నడిపించిన యోధుడు. రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా పదేళ్లు రాష్ట్రాన్ని  ప్రగతిపధంలో నడిపించిన లీడర్.   కేసీఆర్ నేడు( ఫిబ్రవరి 17) 71వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.  

Also Read :  ఢిల్లీ భూకంపం .. ప్రజలకు మోదీ కీలక సూచనలు!

Also Read :  కుంభమేళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ, తెలంగాణ నుంచి స్పెషల్ ట్రైన్స్: లిస్ట్ ఇదే!

అసలు తెలంగాణ (Telangana) వస్తుందని కేసీఆర్ ఎలా నమ్మారు..ఆయనకు నమ్మకం కలిగించిన అంశాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 2001 ఏప్రిల్ 21వ తేదీన టీడీపీ సభ్యత్వానికి  రాజీనామా చేసిన కేసీఆర్ ఏప్రిల్ 27వ తేదీన ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు.  తొలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ప్రారంభించిన కార్యక్రమాలు కేసీఆర్‌ని బాగా ప్రభావితం చేశాయి. 

Also Read :  చూసి రెండేళ్లు...మాట్లాడి ఏడాది..కుమారుడ్ని తలచుకుని ఎమోషనల్ అవుతున్న ధావన్‌!

2001లో మూడు రాష్ట్రాల ఏర్పాటు

అయితే ఇప్పుడున్న ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఒకప్పుడు మధ్యప్రదేశ్ లో ఉండేది.  కానీ 2001 నవంబర్ 01వ తేదీన కొన్ని కారణాల వలన విడిపోయి భారతదేశంలో 26వ రాష్ట్రంగా ఏర్పడింది. ఇక ఉత్తరాఖండ్ కూడా ఒకప్పుడు ఉత్తర్ ప్రదేశ్ లో భాగంగా ఉండేది.  కానీ 2001 నవంబర్ 09 వ తేదీన కొన్ని కారణాల వలన విడిపోయి భారతదేశంలో 27వ రాష్ట్రంగా ఏర్పడింది.  ఇక జార్ఖండ్ రాష్ట్రం ఒకప్పుడు బీహార్ లో భాగంగా ఉండేది. కానీ  కొన్ని కారణాల వలన 2001 నవంబర్ 15వ తేదీన విడిపోయి భారతదేశంలో 28వ రాష్ట్రంగా ఏర్పడింది.  

ఈ మూడు రాష్ట్రాలు 2001వ సంవత్సరం నవంబర్ నెలలోనే వాటి సంబంధిత రాష్ట్రాల నుంచి విడిపోయి కొత్త రాష్ట్రాలుగా ఏర్పాటు అయ్యాయి. ఈ రాష్ట్రాల ఏర్పాటే కేసీఆర్ కు తెలంగాణ వస్తుందన్న నమ్మకాన్ని బలంగా కలిగించాయి. ఆ టైమ్ లోనే కేసీఆర్ కు తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ (Jaya Shankar)  లాంటి వాళ్లు అండగా నిలిచారు.  కొత్తగా ఏర్పాటు అయిన  ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటు వలే  తెలంగాణ ఏర్పాటు అనేది అసాధ్యమేమీ కాదన్నది ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు కేసీఆర్.  రాజకీయ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పి ఆ దిశగా అడుగులు వేసి ఎట్టకేలకు 13ఏళ్లపోరాట స్ఫూర్తితో 2014జూన్ 02వ తేదీన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) నుంచి విడిపోతూ భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది.  

Also Read :  కేసీఆర్ పుట్టిన రోజు.. హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్!

Advertisment
తాజా కథనాలు