KCR Birthday : కేసీఆర్ పుట్టిన రోజు.. హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్!

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ 71వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. అందులో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్ చేశారు.

New Update
kcr, harish rao

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ 71వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు. అందులో భాగంగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్ చేశారు.  "  కేసీఆర్ తెలంగాణ  ఉద్వేగం ,  కేసీఆర్ తెలంగాణ ఉద్రేకం,  కేసీఆర్ తెలంగాణ స్వాభిమానం , కేసీఆర్ జై తెలంగాణ యుద్ధ నినాదం , కేసీఆర్ తెలంగాణ సమున్నత అస్తిత్వం,  కేసీఆర్ తెలంగాణ ప్రజా ఉద్యమ  పటుత్వం,  కేసీఆర్ తెలంగాణ ఆవేశాల  అగ్నితత్వం,  కేసీఆర్ తెలంగాణ అనురాగాల అమృతత్వం, కేసీఆర్ తెలంగాణ ప్రజాగళం, కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవ రణం, కేసీఆర్ తెలంగాణ నూతన రాష్ట్ర ఆవిష్కరణం, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర  అభ్యుదయం, కేసీఆర్ తెలంగాణ జనం గుండెల్లో నిత్య సూర్యోదయం" అని తన ట్వీట్ లో తెలిపారు హరీష్. 

ఎమోషనల్ ట్వీట్

అంతేకాకుండా కేసీఆర్  పై ఎమోషనల్ ట్వీట్ చేశారు హరీష్.  "  మీరు నా తలనిమిరే తల్లిప్రేమ, నాకు ఎనలేని మమకారం పంచిన మేనమామ..  నాకు రాజకీయ చైతన్యాన్ని నేర్పించి,  నాలో ప్రజా సేవా సంస్కారాన్ని రంగరించి,  నన్ను ఉద్యమ కార్యాచరణలో నడిపించి,  నాలోని నాయకత్వ గుణాన్ని ప్రేరేపించి,  నాకు పరిపాలనా  సామర్థ్యాన్ని కల్పించి,  నన్ను చరితార్థుణ్ణి చేసిన మీరు  శత వసంతాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ హరీష్ ట్వీట్ చేశారు. 

Also Read :  Delhi Earthquake: ఢిల్లీ భూకంపం .. ప్రజలకు మోదీ కీలక సూచనలు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు