Pawan Kalyan: ఇక సినిమాలు చేయను.. ప్రెస్ మీట్ లో పవన్ షాకింగ్ ప్రకటన!

'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ తన సినీ కెరీర్, తదుపరి ప్రాజెక్టుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. "ఇక భవిష్యత్తులో సినిమాలు చేస్తానో, చేయనో నాకు తెలియదు!.. దాదాపు సినిమాలకు దూరంగా ఉంటాను" అని అన్నారు.

New Update

Pawan Kalyan: నాలుగేళ్ళ పవన్ స్టార్ ఫ్యాన్స్ నిరీక్షణ మరో మూడు రోజుల్లో తీరబోతుంది. పలు మార్లు వాయిదా పడుతూ వచ్చిన పవన్ 'హరిహర వీరమల్లు' ఎట్టకేలకు జులై 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో 2021లో మొదలైన ఈ సినిమా పూర్తవడానికి నాలుగేళ్లు పట్టింది. ఇక రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రబృందం. ఇందులో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్, డైరెక్టర్ జ్యోతి కృష, నిర్మాత ఏఎం. రత్నం, హీరోయిన్ నిధి అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. 

Also Read: పొట్టి బట్టలు వేసుకున్నందుకే హత్యా?.. రాధికా కేసులో ఫ్రెండ్ సంచలన విషయాలు

పవన్ షాకింగ్ స్టేట్మెంట్ 

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ  తన సినీ కెరీర్, తదుపరి ప్రాజెక్టుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. "ఇక భవిష్యత్తులో సినిమాలు చేస్తానో, చేయనో నాకు తెలియదు!.. దాదాపు సినిమాలకు దూరంగా ఉంటాను" అని అన్నారు. ఇండైరెక్ట్ గా ఇకపై సినిమాలు చేయనని చెప్పకనే చెప్పారు పవన్.  దీంతో పవన్ ఫ్యాన్స్, సినీ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పవన్ స్టేట్మెంట్ పట్ల అందరూ ఆశ్చర్యపోయారు కూడా! ఒకవేళ ఇదే జరిగితే 'ఉస్తాద్ భగత్ సింగ్' పవన్ చివరి సినిమా అవుతుంది. 

పీరియాడిక్ డ్రామాగా రూపొందిన 'హరిహర వీరమల్లు' చిత్రానికి  జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఆస్కార్ విజేత కీరవాణి సంగీతం అందించారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా... సత్యరాజ్, నోరా ఫతేహి, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. 

Also Read: Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' ప్రమోషన్స్ .. పవన్ ప్రెస్ మీట్ లైవ్

Advertisment
Advertisment
తాజా కథనాలు