Heavy Rain : మరో కొద్దిగంటల్లో భారీ వర్షం..అప్రమత్తం చేసిన పోలీసులు

సోమవారం భారీవర్షం కురిసే అవకాశంఉందని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య భారీవర్షం కురిసే అవకాశం ఉన్నందును ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అనవసరంగా బయటకు రావద్దని సూచించారు.

New Update
HYD Rain

HYD Rain

Heavy rain : గత కొంతకాలంగా రోజు సాయంత్రం అయిందంటే భారీ వర్షం కురుస్తోంది. ఆఫీసులు క్లోజ్‌ అయ్యే సమయంలో వర్షం కురుస్తుండటంతో విధులు ముగించుకుని ఇంటిదారి పట్టిన వారికి ఇబ్బందులు తప్పడంలేదు. అంతా ఒకేసారి రోడ్లమీదకు రావడం, వర్షం కురవడం ఒకేసారి కావడంతో భారీ ఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోతుంది.

Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

Heavy Rain In Hyderabad

అదే సమయంలో ఈ రోజు కూడా భారీవర్షం కురిసే అవకాశంఉందని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఈ రోజు సాయంత్రం 7గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య భారీవర్షం కురిసే అవకాశం ఉన్నందును ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. అవసరం అయితే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని, అనవసర ప్రయాణాలు చేయవద్దని పోలీసులు సూచిస్తున్నారు. వీలయినంతవరకు ఇళ్లలోనే ఉండే ప్రయత్నం చేయాలని ట్రాఫిక్‌ పోలీసులు కోరుతున్నారు. ట్రాఫిక్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఇచ్చే సమాచారాన్ని తెలుసుకుని వారి సూచనలను పాటించాలని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కోరారు.

ఇది కూడా చూడండి:Cinema: ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే

Also Read : షాకింగ్ వీడియో.. ట్రైన్ బ్రిడ్జ్‌పై ఉండగా కూలిపోయిన పునాది - వందలమంది ప్రాణాలు!

rain-alert | heavy-rain-alert-in-telangana | heavy-rain-alert-in-hyderabad | heavy-rain-alert | telangana rain alert | Rain Alert To Telangana

Advertisment
Advertisment
తాజా కథనాలు