Ranganayaka Sagar Incident | సాగర్లో పడి నలుగురు | Siddipet District | RTV
కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు పాలేవో నీళ్లేవో అర్థమైపోయిందని, అందుకే ఈ రోజు రాష్ట్రమంతా కేసీఆర్ వైపు చూస్తున్నది మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జి ఆదర్శ్ రెడ్డి నిర్వహించిన పాదయాత్రకు హరీష్ రావు హాజరయ్యారు.
ఆడవారంటేనే అమ్మ మనసు అంటారు. ఆ అమ్మ మనసు మనుషులపైనా, పక్షులపైనా. జంతువులపైనా ఒకేలా చూపిస్తుంది. ఆకలితో ఉన్నబిడ్డలు తినకుంటే ఆ అమ్మ మనసు నొచ్చుకుంటుంది. ఓ మహిళ పక్షుల ఆకలిని అర్థం చేసుకుంది. తల్లి'తనంతో ఆలోచించి పక్షుల కోసం సాగు చేసిన పంటనే త్యాగం చేసింది.
సిద్ధిపేట జిల్లా వర్గల్ మండలం జబ్బాపూర్ గ్రామంలో శివాజీ మహారాజ్ జెండా ఆవిష్కరిస్తుండగా పోల్ కరెంట్ తీగలకు తగిలింది. ఈ ప్రమాదంలో లింగ ప్రసాద్ అనే యువకుడు మృతి చెందాడు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. 13 మందికి తీవ్ర గాయాలైయ్యాయి.
సిద్దిపేట జిల్లా శనిగరం పరిధిలోని శంకర్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ - హైదరాబాద్ ప్రధాన రహదారిపై అదుపుతప్పిన ఎర్టిగా కారు డివైడర్ ను ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి.
బీఆర్ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తొమ్మిది సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నామని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. వాస్తవాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంటే.. ప్రజా అనుకూల విధానాలను సాధించే ప్రయత్నం చేసి ప్రభుత్వం దాడులు చేస్తోందని కోదండరామ్ ఆరోపించారు.