TG Crime: కోదాడలో విషాదం.. ప్రభుత్వ టీచర్ ప్రాణం తీసిన సిగరేట్.. అసలేమైందంటే?

సూర్యాపేట జిల్లా మంగళితండాలో మద్యం తాగిన ప్రభుత్వ టీచర్ సిగరెట్‌ వెలిగించుకొని మంచంపై పడుకున్నారు. మత్తులో దాన్ని ఆర్పివేయకుండా నిద్రలోకి జారుకొన్నారు. దీంతో మంచంపై మంటలు చెలరేగి ఎస్జీటీ టీచర్ ధారావత్‌ బాలాజీ(52) మృతి చెందాడు.

New Update
annamaianh crime news

suryapet crime

సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలో విషాదం చోటు చేసుకుంది. మద్యం తాగిన ప్రభుత్వ టిచర్ సిగరెట్‌ వెలిగించుకొని మంచంపై పడుకున్నారు. మత్తులో ఉన్న అతను దాన్ని ఆర్పివేయకుండా అలాగే నిద్రలోకి జారుకొన్నారు. దీంతో మంచంపై మంటలు చెలరేగి  చిటర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంపై ఎస్సై అనిల్‌రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళితండాకు చెందిన ధారావత్‌ బాలాజీ(52) నడిగూడెం మండలం చెన్నకేశవాపురం ఎంపీపీఎస్‌ పాఠశాలలో ఎస్జీటీ టీచర్‌గా పని చేస్తున్నారు. 

Also Read : సెన్సెక్స్ భారీగా పతనం.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Also Read :  బాలీవుడ్‌లోకి పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఎంట్రీ

ప్రాణం తీసిన సిగరెట్..

ఆదివారం శ్రీరామ నవమి పండగ కావడంతో భార్య ఇద్దరు పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్లారు. సింగిల్‌గా ఉన్న ఉపాధ్యాయుడు బాలాజీ మద్యం తాగి  సిగరెట్‌ తాగుతూ ఇంటి వరండాలోని మంచంపై పడుకున్నారు. అలాగే కొద్దీసేపటి నిద్రలోకి జారుకోగా.. సిగరెట్‌ మంచం నవారుపై పడి మంటలు చెలరేగాయి. మరో పక్క కూలర్‌ గాలి తోడవడంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఇంటి చుట్టు పక్కన ఎవరూ లేకపోవడం, బాలాజీ మత్తులో ఉండటంతో మంటలు  అంటుకుని సజీవ దహనమయ్యాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఇది కూడా చదవండి: సమ్మర్ ఎఫెక్ట్.. వాచిపోతున్న నిమ్మకాయల ధరలు.. పిండితే రసం కూడా రావట్లే!

Also Read :  ఆ టాబ్లెట్ వల్ల గర్భిణీ స్త్రీలకు అలసట...ఈ జాగ్రత్తలు తీసుకుంటే మంచిది!



(ts-crime-news | latest-telugu-news | today-news-in-telugu | telangana crime incident | telangana crime news | telangana-crime-updates | government-teachers)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు