Supreme Court: పార్టీ ఫిరాయించిన MLAలకు 3 నెలలే డెడ్‌లైన్.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

పార్టీ ఫిరాయించిన 10 మంది BRS ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. 3 నెలల్లోగా వారి అనర్హత విషయం తేల్చాలని స్పీకర్‌ను ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. దీంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

New Update
BRS MLAS

పార్టీ ఫిరాయించిన 10 మంది BRS ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు గురువారం కీలక తీర్పు ఇచ్చింది. 3 నెలల్లోగా వారి అనర్హత సంగతి తేల్చాలని స్పీకర్‌ను ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం. న్యాయస్థానమే వారిపై అనర్హత వేటు వేయాలని వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మూడు నెలల్లో వారిపై అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలంటూ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 31 లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ఏళ్ళ తరబడి పార్టీ ఫిరాయింపుల కేసులు పెడింగ్‌లో ఉంచడం సరికాదని అభిప్రాయపడింది.

దీంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాలపై బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు మరో 3 నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయంటున్నారు. స్పీకర్ విచారణకు ఆటంకాలు కలిగించొద్దని సుప్రీం కోర్టు తెలిపింది. 

Also Read :  రాష్ట్ర ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ నివేదిక

10 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీరే.. 

BRS పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, తెల్లం వెంకట్రావ్‌, కడియం శ్రీహరిలు పార్టీ మారారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌ రెడ్డి, వివేకానంద సుప్రీంకోర్టుకి వెళ్లారు. 2025 జనవరి 15న స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. అదే రోజు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌‌రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్‌ గౌడ్‌, అరికెపూడి గాంధీ, మహిపాల్‌ రెడ్డి, సంజయ్‌ కుమార్లు పార్టీ ఫిరాయించారని కేటీఆర్‌తోపాటు కొందరు నేతలు రిట్‌ పిటిషన్‌ వేశారు. సుప్రీంకోర్టులో తొమ్మిది సార్లు విచారణకు వచ్చాయి. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ లతో కూడిన ధర్మాసనం అన్ని వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ 3న తీర్పును రిజర్వ్ చేసింది. అన్నీ పిటిషన్లు కలిపి సుప్రీం కోర్టు విచారించి గురువారం తీర్పు ఇచ్చింది. అక్టోబర్ 31 లోగా పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై నిర్ణయం తీసుకోవాలని ఉన్న న్యాయ స్థానం స్పీకర్‌ను ఆదేశించింది. 

BRS గుర్తుపై గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 ఎమ్మెల్యేలు తర్వాత పార్టీ మారారు. దీంతో బీఆర్ఎస్ నేతలు పార్టీ ఫిరాయింపు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ప్రతివాదులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఎమ్మెల్యేలు పి శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలె యాదయ్య, టి ప్రకాశ్ గౌడ్, ఎ గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ఎం సంజయ్ కుమార్ ఉన్నారు.

Also Read :  రంగారెడ్డి జిల్లాలో దారుణం.. 40 ఏళ్ల వ్యక్తితో బాలికకు వివాహం!

Party defections | Supreme Court | latest telangana news | latest-telugu-news

Advertisment
తాజా కథనాలు