/rtv/media/media_files/2025/01/16/d70CoqXul0IGeOFKHg86.jpg)
పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS) సుప్రీం కోర్టు (Supreme Court) ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. కేటీఆర్ వేసిన పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్, చంద్రన్ ల ధర్మాసనం సోమవారం విచారించింది. కేటీఆర్ పిటీషన్‌ను గతంలో ఇదే వ్యవహారంపై దాఖలైన షిటిషన్‌కు జత చేసింది ధర్మాసనం. రెండూ పిటిషన్లను కలిపి ఫిబ్రవరి 10న విచారిస్తామని సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది.
Also Read : అలర్ట్.. హైదరాబాద్‌లో ఫేక్ SIM కార్డ్స్ కలకలం
Also Read: నల్గొండ జిల్లాలో నకిలీ జర్నలిస్టుల గుట్టు రట్టు
Supreme Court Gave Big Shock To Telangana MLA's
బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, కోరుట్ల సంజయ్, మహిపాల్ రెడ్డి, అరెకపూడి గాంధీ, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలకి సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. ప్రస్తుతం ఈ పిటిషన్ విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది.
Also read: 2022 నుంచి పరారీలో ఉన్నాడు..హైదరాబాద్ కాల్పుల నిందితుడు పాత దొంగే..
గతంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావుల పిటిషన్‌తో కలిసి కేటీఆర్ ప్రస్తుతం వేసిన పిటిషన్‌ను విచారించనుంది. ఈ పిటిషన్లు ప్రతివాదులైన తెలంగాణ స్పీకర్ తరుపు న్యాయవాది ముకుల్ రోహిత్గికి అందజేయాలని సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది.
Also Read : ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. హాల్ టికెట్లపై కీలక అప్‌డేట్