/rtv/media/media_files/2025/02/02/rEGs3hqRmQjY0BArVk8r.jpg)
Fake Journalists
Fake Journalists : ఇబ్బడిముబ్బడిగా సోషల్ మీడియా ఛానల్స్ పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరూ జర్నలిస్టుల ముసుగు తగిలించు కుంటున్నారు. యూట్యూబ్, ఈపేపర్ ఇలా ఏదో ఒక మీడియా పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు. లేదంటే వారి వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పెడుతామని బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్నారు. దీంతో ఉన్నవారు ఎంతోకొంత ముట్టజెప్పి చేతులు దులుపు కుంటుండగా లేనివారు మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
Also Read : జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే... సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు!
తాజాగా నల్గొండ జిల్లాలో నకిలీ జర్నలిస్టుల గుట్టు రట్టైంది. జర్నలిస్టులగా చలామణి అవుతూ ఏకంగా పోలీస్ అధికారినే టార్గెట్ చేశారు. జర్నలిస్టుల ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతూ బ్లాక్‌మెయిల్ చేయడంతో సదరు సీఐ ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. కొంతకాలంగా పోలీసుల నే టార్గెట్ చేస్తూ అక్రమ వసూళ్లకు తెగబడుతోంది ఓ ముఠా. సోషల్ మీడియాలో నెగిటివ్ వార్తలు రాస్తామని బెదిరింపులకు పాల్పడుతోంది గ్యాంగ్. ఏకంగా ఓ సీఐ స్థాయి అధికారిని బెదిరించి రూ 5 లక్షలు డిమాండ్ చేసింది. తన వద్ద అంతమొత్తం లేదని చెప్పిన వినకపోవడంతో సదరు సీఐ స్నేహితుల వద్ద అప్పుచేసి రూ 1.10 లక్షలు ముట్ట జెప్పాడు. అయినా వినకుండా మిగిలిన 4 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో సదరు సీఐ ఆత్మహత్యాయత్నం చేశాడు. గత నెల రోజులుగా డబ్బుల కోసం బ్లాక్ మెయిల్ చేస్తూ పోలీసు అధికారులను ముప్పు తిప్పలు పెడుతోంది ముఠా. సీఐ కుటుంబానికి టార్చర్ పెట్టగా నకిలీ విలేఖరుల ఆగడాలు తట్టుకోలేక ఆత్మహత్యకు సిద్ధపడింది సీఐ కుటుంబం.
Also Read: ANUJA: ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ షార్ట్ ఫిల్మ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
కాగా సీఐ అత్మహత్యాయత్నానికి కారణమేంటని విచారించగా నకిలీ విలేకరుల గుట్టు రట్టయింది. దీంతో పోలీసులు నకిలీ విలేకరి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత పోలీసు అధికారి పిర్యాదు తో నకిలీ విలేఖరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరికొందరు ముఠా సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఈ ముఠా పై గతంలో పలు కేసులున్నట్టు తెలుస్తోంది. వారి నేరచరిత్ర చిట్టా పరిశీలిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు.
Also Read: Vijay Sethupathi: తమిళంలో పాన్ కార్డు మార్చాలి.. స్టార్ హీరో రిక్వెస్ట్ .. ఎందుకిలా?