HYD: 2022 నుంచి పరారీలో ఉన్నాడు..హైదరాబాద్ కాల్పుల నిందితుడు పాత దొంగే..

నిన్న హైదరాబాద్ ప్రిజం పబ్ దగ్గరలో పోలీసులపై కాల్పులకు తెగబడ్డ నిందితుడిని అరెస్ట్ చేశారు. ఇతను చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ గా గుర్తించారు. 2022 నుంచి నిందితుడు పరారీలో ఉన్నాడని చెబుతున్నారు. 

author-image
By Manogna alamuru
New Update

గచ్చిబౌలిలోని ఓ పబ్‌లో నిన్న రాత్రి దొంగను పట్టుకునేందుకు పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలోనే అతడు పోలీసులపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సైబరాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి తొడభాగంలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. అలాగే కానిస్టేబుల్‌తో పాటు పబ్‌లో ఉన్న ఒక బౌన్సర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. 

పోలీసుల అదుపులో దొంగ 

అయితే దొంగ కాల్పులు జరిపినప్పటికీ పోలీసులు సాహసం చేసి ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఈ కాల్పుల ఘటన గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌‌లో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇక దొంగను పట్టుకున్న పోలీసులు.. ఆ దొంగ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌గా చెబుతున్నారు. 

Also Read: USA: కెనడా, మెక్సికో దిగుమతి సుంకాల ఉత్తర్వులపై సంతకం..ట్రంప్

2022 లో పారిపోయాడు...

ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న బత్తుల ప్రభాకర్ గురించి మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. నిందితుడు అసలు పేరు రాహుల్ రెడ్డి. వయసు 29 ఏళ్ళు. ఇతను పాత నేరస్థుడే. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ప్రభాకర్ పైన 80 వరకూ దొంగతనాల కేసులు ఉన్నాయి.  రీసెంట్ గా సైబరాబాద్ పరిధిలో కూడా దొంగతనం చేశాడని పోలీసులు చెబుతున్నారు. ప్రభాకర్ ఎక్కువగా ఇంజనీరింగ్ కాలేజీలను టార్గెట్ గా చేసుకుని చోరీలు చేస్తుంటాడు.  2022 మార్చిలో విచారణ కోసం ఏపీలోని అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్లిన సమయంలో ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి  తప్పించుకుపోయాడు. అప్పటినుంచి పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచీ పోలీసులు ఇతని కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే నిన్న పక్కా సమాచారంతో ప్రిజం పబ్ దగ్గర నిందితుడు ఉన్నాడని తెలుసుకుని పోలీసులు పట్టుకునేందుకు వెళ్ళారు. 

Also Read: Pak: బలూచిస్తాన్ లో మారణ హోమం..41 మంది మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు