Student Crime: కాలు జారి కింద పడిందని కాలేజీ నుంచి ఫోన్.. వెళ్లి చూస్తే...

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.బాచుపల్లి కౌసల్య కాలనీలో ఉన్న ఎస్ ఆర్ గాయత్రి మహిళా కళాశాలలో పూజిత అనే అమ్మాయి ఇంటర్ సెకండియర్ చదువుతుంది.కాలేజీలోనే పూజిత మృతిచెందింది.

New Update
STUDENT DIES

STUDENT DIES

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ విద్యార్థిని (Inter Student) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాచుపల్లి కౌసల్య కాలనీలో ఉన్న ఎస్ ఆర్ గాయత్రి మహిళా కళాశాలలో పూజిత అనే అమ్మాయి ఇంటర్ సెకండియర్ చదువుతుంది. రోజూలానే బుధవారం ఉదయం కూడా పూజిత కాలేజ్ కు వెళ్లింది. కాలేజీకి వెళ్లిన కొంత సేపటికే విద్యార్థిని బిల్డింగ్ లో అనుమానాస్పదంగా మృతి చెందింది. విద్యార్థిని ఉదయం మృతి చెందినప్పటికీ కళాశాల యాజమాన్యం విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు. గుట్టుచప్పుడు కాకుండా డెడ్ బాడీని గాంధీ హాస్పిటల్ కు తరలించి ఆపై తీరికగా తల్లిదండ్రలకు సమాచారం అందించారు.

Also Read : ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!

ఆమె తల్లిదండ్రులకు గాంధీ హాస్పిటల్  (Gandhi Hospital)నుంచి కాలేజ్ యాజమాన్యం ఫోన్ కాల్ చేసింది. ఫోన్ చేసి గాంధీ ఆస్పత్రికి రావాలని కళాశాల యాజమాన్యం చెప్పింది. దీంతో.. ఏం జరిగిందో పూజిత తల్లిదండ్రులకు అర్థం కాలేదు. మీ అమ్మాయి బాత్ రూమ్ లో జారి కిందపడిందని, హాస్పిటల్ లో చేర్పించాం అని ఒకసారి... మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది మీరూ మీ అమ్మాయిని చూసుకోవడానికి గాంధీ హాస్పిటల్ కు రండి అని మరో సారి ఇలా పొంతన లేని సమాధానాలతో విద్యార్ధిని తల్లిదండ్రులకు తెలిపారు. దాంతో కళాశాల వద్ద విద్యార్ధిని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. తమ అమ్మాయి మృతికి కళాశాల యజమాన్య వేధింపులే కారణం అని, న్యాయం చేయాలని విద్యార్థిని తల్లిదండ్రులు డిమాండ్​ చేశారు. 

Also Read: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే

Student Dies In College

ఉదయం నవ్వుతూ కాలేజీకి వెళ్లిన కూతురు సాయంత్రానికి ఇంటికి తిరిగొస్తుందనుకుంటే ఆమె మృతదేహాన్ని చూడడానికి గాంధీ ఆసుపత్రికి రావలసి వచ్చిందని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.పూజిత చనిపోయిన విషయానికి సంబంధించి  గాయత్రి కళాశాల యాజమాన్యం పొంతనలేని కారణాలు చెప్పడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదట బాత్ రూమ్ లో జారిపడిపోయి చనిపోయిందని చెప్పి, తర్వాత ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారని పూజిత బంధువులు ఆరోపించారు. పూజిత చనిపోయిన విషయాన్ని కళాశాల యాజమాన్యం గోప్యంగా ఉంచే ప్రయత్నం చేయడంతో ఈ అనుమానాలు, ఆరోపణలు మరింత బలపడుతున్నాయి.

ఇది కూడా చదవండి: ఆరోగ్యం సహకరించకున్నా ఆలయాల సందర్శన.. కారణం అదే.. పవన్ కీలక ప్రకటన!

ఇది కూడా చదవండి: Lavanya: షాకింగ్ న్యూస్.. పోలీస్ బాస్‌తో లావణ్య రాసలీలలు.. వీడియో వైరల్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు