New Ration Card: ఇది మరీ దారుణం.. రేషన్ కార్డు దరఖాస్తుకు రూ.2వేలు.. మీసేవ సెంటర్ల వసూళ్ల దందా!

కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం రూ.50కి మించి వసూలు చేయొద్దంటూ మీసేవ సెంటర్లను తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రూ.50కి బదులు ఏకంగా రూ.2వేలు వసూలు చేస్తున్నారు.

New Update
ration card

ration card

New Ration Card: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల పేరుతో కొన్ని మీసేవ సెంటర్లు దందాలు మొదలుపెట్టేశాయి.   కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం రూ.50కి మించి వసూలు చేయొద్దంటూ మీసేవ సెంటర్లను తెలంగాణ ప్రభుత్వం(Telangana) ఆదేశించింది. అదనంగా వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని కోరింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో రూ.50కి బదులు ఏకంగా రూ.2వేలు వసూలు చేస్తున్నారు. మిగతా ప్రాంతాల్లోనూ అధికంగానే దండుకుంటున్నారు. 

Also Read :  Chiranjeevi: ఎంత మాటన్నావ్ చిరు.. స్టేజీపైనే మెగాస్టార్ బూతులు: నెటిజన్ల ట్రోలింగ్

మళ్లీ దరఖాస్తు అక్కర్లేదు

వెంటనే ఈ దోపిడీపై అధికారులు ఫోకస్ పెట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.  ప్రజాపాలన, ప్రజావాణి కార్యక్రమాల్లో  రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ ధరఖాస్తు చేయాల్సిన అవసరం లేదంటున్నారు అధికారులు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు కుటుంబ సభ్యులందరి ఆధార్‌‌‌‌ కార్డులు, ఇంటి కరెంట్​బిల్లు తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది.  కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులతో పాటుగా పాత రేషన్  కార్డుల్లో మార్పుల కోసం కూడా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

Also Read :  Odisha Govt: అదిరిపోయిందిగా : ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం .. పెళ్లికి ముందు ఆ కౌన్సెలింగ్!

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. గత బీఆర్ఎస్ హయాంలో దాదాపుగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ కూడా సంవత్సరం పాటూ ఇవ్వలేదు. తాజాగా జనవరి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమానికి స్వీకారం చుట్టింది.  అయితే కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కోసం టైమ్ లిమిట్ అంటూ ఏమీ లేదని  ఇది నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం చెబుతోంది.  

Also Read :  IND vs ENG : నేడు ఇంగ్లండ్తో టీమిండియా మూడో వన్డే.. ఆ ఇద్దరు ఔట్ !

Also Read :  Liquor Door Delivery: ఏపీలో వైన్ డోర్ డెలివరీ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు