TTD: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై వాట్సాప్‌లోనే

టీటీడీ సేవలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వాట్సాప్‌ గవర్నెన్స్‌లోకి తిరుమల తిరుపతి దేవస్థానం సేవల్ని త్వరలోనే తీసుకొస్తామన్నారు.రైల్వే టికెట్లు కూడా వాట్సాప్‌ గవర్నెన్స్‌లోకి అందుబాటులోకి తెస్తామన్నారు.

New Update
TTD

TTD

తిరుమల శ్రీవారి భక్తులకు ఏపీ సీఎం చంద్రబాబు తీపికబురు చెప్పారు. రాబోయే రోజుల్లో టీటీడీ సేవల్ని వాట్సాప్ గవర్నెన్స్‌లోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. తిరుమల ఆలయంతో పాటుగా విజయవాడ శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం, శ్రీశైలం మల్లన్న ఆలయంలోనూ వాట్సాప్‌ సేవలు అందుబాటులోకి తెచ్చినట్లు ఆలయ ఈవోలు ప్రకటించారు. కేంద్రంతో మాట్లాడి రైలు టికెట్లు వాట్సాప్ గవర్నెన్స్‌లోకి తీసుకొని వస్తామని చెప్పారు. 

Also Read: Singapore: సింగపూర్‌కు ఉగ్రదాడుల ముప్పు.. ప్రజలంతా రెడీగా ఉండాలంటూ మంత్రి వ్యాఖ్యలు!

సినిమా టికెట్లు బుక్ చేసుకోవడంతో పాటుగా ఆర్టీసీ బస్సుల జీపీఎస్‌ ట్రాకింగ్‌ వాట్సప్‌లోనే చూసుకునే సదుపాయం కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాట్సాప్‌లో మెసేజ్ చేయలేని వారి కోసం వాయిస్ సర్వీస్ అందుబాటులోకి తీసుకుని వస్తామన్నారు.

Also Read: supreme Court: బస్సు ప్రమాదంలో చనిపోయిన మహిళకు రూ.9 కోట్ల పరిహారాన్ని చెల్లించాల్సిదే

వాట్సాప్‌ సేవల ద్వారా...

రాబోయే రోజుల్లో మరిన్ని వాట్సాస్ సేవల్ని అందుబాటులోకి తీసుకుని వస్తామని సీఎం వివరించారు. ప్రజలెవ్వరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సేవలన్నీ వాట్సాప్‌లోనే అందుబాటులో ఉంచుతామన్నారు. జనవరి 30న ప్రారంభించిన వాట్సాప్‌ సేవల ద్వారా వారంలో 2.64 లక్షల లావాదేవీలు జరిగాయని.. వాట్సాప్‌ గవర్నెన్స్‌పై ప్రజల్లో సంతృప్తిగా ఉన్నారో లేదో అధ్యయనం చేయాలన్నారు. 

వాట్సాప్ గవర్నెన్స్ సత్ఫలితాలు ఇస్తున్నాయని.. ఇప్పుడు అందుబాటులో ఉన్న 161 సేవలకు తోడు.. మరో 45 రోజుల్లో 161 సేవలు అందబాటులోకి తీసుకురావాలని చంద్రబాబు అన్నారు. రాబోయే ఆరు నెలల్లో ప్రభుత్వ సేవలన్నీ వాట్సాప్‌ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

రాష్ట్రంలో ఆలయలకు సంబంధించిన సేవల్ని వాట్సాప్ గవర్నెన్స్‌లో ప్రజలు ఎక్కువగా కోరుకుంటున్నట్లు మంత్రి లోకేష్‌ అన్నారు. టీటీడీ సేవల్ని ఇందులో తీసుకురావాలనే రిక్వెస్ట్‌లు వస్తున్నాయని.. రాబోయే రోజుల్లో రేషన్‌ కార్డు డిజిటల్‌ ప్రింట్‌ను కూడా ఒరిజినల్‌ కార్డుగా పరిగణిస్తారన్నారు. ఇకపై ప్రభుత్వశాఖలకు సంబంధించి డాక్యుమెంట్లు, సర్టిఫికేట్‌లు వాట్సాప్‌లో నే అందుబాటులోకి తీసుకుని వస్తామన్నారు.  

త్వరలోనే డిజిటల్‌ రేషన్‌ కార్డులను కూడా  క్యూఆర్‌ కోడ్‌తో జారీ చేస్తామన్నారు. 

Also Read:Trump: ట్రంప్‌ మరో తలతిక్క నిర్ణయం...ప్రపంచ దేశాలకు విరుద్ధంగా పేపర్‌ వద్దు..ప్లాస్టికే ముద్దంటన్న పెద్దన్న!

Also Read: Social media torcher : ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ ఒకే చేసిన బాలిక...టార్చర్‌ చేసి అవి పంపాలని..

Advertisment
తాజా కథనాలు