ఆరోగ్యం సహకరించకున్నా ఆలయాల సందర్శన.. కారణం అదే.. పవన్ కీలక ప్రకటన!

నాలుగేళ్ల క్రితం నాటి తన మొక్కులను చెల్లించుకునేందుకే దక్షిణాది ఆలయాలను సందర్శిస్తున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. ఇది పూర్తిగా తన వ్యక్తిగతమని.. పాలిటిక్స్ తో సంబంధం లేదన్నారు. తిరుపతి లడ్డూ కల్తీ చేసిన వారిని అరెస్ట్ చేయడం హర్షణీయమన్నారు.

New Update
AP Deputy CM Pawan Devotional Tour

AP Deputy CM Pawan Devotional Tour

ఆలయాల సందర్శన తన వ్యక్తిగత పర్యటన అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు. దక్షిణాది పుణ్యక్షేత్రాల దర్శనం సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు. దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన తన వ్యక్తిగత అంశంమని.. దీనికి పాలిటిక్స్ తో సంబంధం లేదన్నారు. సుమారు నాలుగున్నర సంవత్సరాల క్రితం చెల్లించుకోవలసిన మొక్కులను తీర్చుకుంటున్నానన్నారు. తన ఆరోగ్యం అంతగా సహకరించకున్నా ఇందుకోసం వచ్చానన్నారు. కేరళతో పాటు తమిళనాడులో ఉన్న ఆలయాలను దర్శించుకుంటున్నానన్నారు. భక్తుల మనోభావాలు కాపాడాలి అన్నదే తన ఆవేదన అని అన్నారు.

దేశవ్యాప్తంగా తిరుమల శ్రీవారి దర్శనానికి కోట్లాది మంది భక్తులు ఎంతో నమ్మకంగా, ఆధ్యాత్మిక చింతనతో వస్తుంటారన్నారు. అలా వచ్చే వారి మనోభావాలు గాయపడకూడదన్నదే తన ఆవేదన అని అన్నారు. తిరుమల లడ్డులో కల్తీ  జరగడం చాలా దురదృష్టకరమన్నారు. లడ్డూ ప్రసాదం కల్తీకి పాల్పడిన వారిని అరెస్ట్ చేయడం హర్షణీయమన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ భవిష్యత్తులో జరగకూడదన్నదే తన బలమైన ఆకాంక్ష అని అన్నారు. భవిష్యత్తులో కూడా టీటీడీ ఆలయ సాంప్రదాయాలను కాపాడటంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.

ఎర్ర చందనంపై దేశవ్యాప్తంగా ఒకే విధానం

ఎర్ర చందనాన్ని అక్రమ రవాణా చేస్తున్నప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. ఎర్రచందనం అమ్మకం విషయంలో దేశం మొత్తానికి నూతన విధానం తీసుకురావాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు