/rtv/media/media_files/2025/02/24/CK4JI5pHmagPETl9yEK6.jpg)
ap assembly (1) Photograph: (ap assembly (1))
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైయ్యాయి. అసెంబ్లీలో గవర్నర్ అబ్ధుల్ నజీర్ ప్రసంగాన్ని మొదలుపెట్టగానే వైసీపీ ఎమ్మెల్యేలు అడ్డకున్నారు. ప్రతిపక్షాన్ని గుర్తించండి అంటూ వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ అసెంబ్లీలోనే నినాదాలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాల మధ్యనే గవర్నర్ ప్రసంగం కొనసాగుతోంది. సభ ప్రారంభమైన 2 నిమిషాలకే వైఎస్ జగన్‌తోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గందరగోళం సృష్టించారు. 11 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ చుట్టూ చేరి నినాదాలు చేశారు.
Also Read ; Champions trophy : టీమిండియా ఆటకు ఫిదా అయిన పాక్ ఫ్యాన్స్.. జర్సీ మార్చి సంబరాలు
ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. సభలో కొద్దిసేపు ఆందోళన చేసి సభ నుంచి వాకౌట్ చేశారు వైసీపీ నాయకులు. కావాల్సిన సంఖ్యాబలం లేనందున వైసీపీ ప్రతిపక్ష పార్టీ హోదా కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ప్రజా సమస్యలపై పోరాడటానికి వైసీపీనీ ప్రతిపక్షపార్టీగా గుర్తించాలని ఆ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీ శాసనసభ సభ్యులు వ్యూహాత్మకంగానే అసెంబ్లీకి వచ్చి వాకౌట్ చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఇకపై జరిగేే మొత్తం అసెంబ్లీ సమావేశాలకు గైహాజరు కావడానికే ఇలా వచ్చి.. అలా వెళ్లారని టీడీపీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.