/rtv/media/media_files/2025/04/18/00sRlPmmYZZw3dsV8DQf.jpg)
Fake letters
Fake letters : తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ విషయంలో గడచిన ఏడాది కాలంగా ట్విస్ట్ ల మీదా ట్విస్టులు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే తమ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ఆయా నియోజక వర్గాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నారాయణ్‌పేట జిల్లా మక్తల్‌లో సంచలన లేఖలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలను హెచ్చరిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు రాసిన లేఖలు స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించాయి.
Also Read: Trump: ఇటలీ ప్రధాని మెలోని అంటే నాకు చాలా ఇష్టమంటున్న పెద్దన్న!
"మేము నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలం.." అంటూ మొదలైన ఆ లేఖలో సీఎం రేవంత్ రెడ్డిని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. "ఖబడ్దార్... మీ పలుకుబడి ఉపయోగించి మా ఎమ్మెల్యే (మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి)కి మంత్రి పదవి రాకుండా చేశావో అప్పుడు నీ భరతం పట్టడం ఖాయం. రాష్ట్రంలో పార్టీ అడ్రస్ గల్లంతవుతుంది. మిమ్మల్ని సీఎం పదవి నుంచి దించేస్తాం.." అంటూ ఆ లేఖలో గుర్తుతెలియని వ్యక్తులు స్పష్టంగా పేర్కొన్నారు. ఈ హెచ్చరికలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.
Also read: Rahul Gandhi: రోహిత్ వేముల పేరుతో చట్టం.. CMకు రాహుల్ గాంధీ లేఖ
అయితే.. ముదిరాజు సామాజిక వర్గం పేరుతోనే ఈ లేఖలు వెలుగులోకి రావడంతో ఆ వర్గం నేతలు, పోలీసులు అప్రమత్తమయ్యారు. సంచలనం సృష్టిస్తున్న ఈ లేఖలు ఎవరు రాశారు..? వాటి వెనుక ఉన్న కారణాలేమిటి..? అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.మరోవైపు.. ఈ లేఖల విషయం తెలియగానే రాష్ట్రంలోని ముదిరాజు సంఘం నేతలు స్పందించారు. ఈ లేఖలకు తమ సామాజిక వర్గానికి ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేశారు. అంతేకాకుండా.. ఈ విషయంపై వారు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు కూడా చేశారు. తమ పేరును దుర్వినియోగం చేశారని ఆ ఫిర్యాదులో ముదిరాజ్ సంఘం నేతలు పేర్కొనటం గమనార్హం.
Also Read: Lady Don: హాట్ టాపిక్‌గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్
లేఖలో ఏముందంటే!
‘రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సీఎం, మంత్రులకు హెచ్చరిక.. మేము (ముదిరాజ్ సామాజిక వర్గం) తెలంగాణ జనాభాలో మొదటి స్థానంలో ఉన్నం. మా సామాజిక వర్గం నుంచి ఒకే ఒక్క ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఎన్నికయ్యారు. మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. ఇంతవరకు ఊసెత్తడం లేదు. మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా మీరు అడ్డుపడుతున్నరు. మా ఎమ్మెల్యేకు టికెట్ మీ దయా దాక్షిణ్యాలపై రాలేదు.. ఆయనపై మల్లికార్జున ఖర్గే ఆశీస్సులున్నయి. నువ్వు.. నీ సామాజిక వర్గంవారు ఎన్ని జిమ్మిక్కులు చేసినా మంత్రి పదవి ఖాయం. నువ్వు నీలం మధు ముదిరాజ్‌తో కుమ్ముకై వంద కోట్ల బేరం కుదుర్చుకొని అతడికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వాలని ప్రయత్నం చేసినవు. ఈ విషయం ఏఐసీసీకి తెలిసి నీకు మొట్టికాయలు వేసింది. ఖబడ్దార్ బిడ్డా.. నీ పలుకుబడి ఉపయోగించి మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా చేశావో నీ భరతం పట్టడం ఖాయం. రాష్ట్రంలో కాంగ్రెస్ ఖతం.. నిన్ను సీఎం పదవి నుంచి దించడం అనివార్యం’
ఇది కూడా చదవండి: వంటలో ఈ మూడు పదార్థాలు వాడితే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు
మరోవైపు శ్రీహరికి మంత్రి పదవి ఇవ్వద్దు అంటూ రేవంత్ రెడ్డి అధిష్టానానికి రాసినట్లు మరో లేఖ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఎంపీ మల్లురవి స్పందిస్తూ అది ఫేక్ లేఖ అంటూ కొట్టిపడేశారు.దానిపై చర్య తీసుకుంటామని హెచ్చరించారు.
Also Read : కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల దుర్మరణం!