Rahul Gandhi: రోహిత్ వేముల పేరుతో చట్టం.. CMకు రాహుల్ గాంధీ లేఖ

AICC అగ్రనేత రాహుల్ గాంధీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. విద్యాసంస్థల్లో కుల దూషణ అరికట్టేనా రోహిత్ వేముల పేరుతో చట్టం తీసుకురావాలని ఆయన సూచించారు. 2016లో తెలంగాణ విద్యార్థి రోహిత్ వేముల HCUలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.

New Update
Rahul gandhi later to cm

Rahul Gandhi: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ద రామయ్యకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాశారు. రోహిత్ వేముల పేరు మీద ఆ రాష్ట్రంలో ఓ చట్టం తీసుకురావాలని ఆయన ముఖ్యమంత్రికి సూచించారు. విద్యా సంస్థల్లో కులం పేరుతో దూషించే చర్యలకు అడ్డుకట్ట వేసేలా బలమైన చట్టం తయారు చేయాలని కోరారు. రోహిత్ వేముల తెలంగాణ దలిళ విద్యార్థి నాయకుడు.

Also Read: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు ఏపీ వాసుల దుర్మరణం!

Also Read: Lady Don: హాట్ టాపిక్‌గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదుతున్న రోహిల్ వేముల 2016లో సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. వేముల రోహిత్ వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో క్యాంపస్ మొత్తం ఒక్కసారిగా బగ్గుమంది. రోహిత్ వేముల సూసైడ్ అప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. 

Also Read: Trump: ఇటలీ ప్రధాని మెలోని అంటే నాకు చాలా ఇష్టమంటున్న పెద్దన్న!

పార్లమెంట్‌లో శుక్రవారం రాహుల్ గాంధీ దళిత, ఆదివాసీ, ఓబీసీ విద్యార్ధులను కలిశారు. ఈ సందర్భంగా విద్యలో కుల వివక్షకు వ్యతిరేకంగా వారి పోరాడాలని వారు కోరారు. ఈ అన్యాయాన్ని అంతం చేయడానికి రోహిత్ వేముల చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. చదువు చెప్పే ప్రదేశంలో ఏ పిల్లవాడు కూడా కుల వివక్షను ఎదుర్కోకూడదని కాంగ్రేస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు