Lady Don: హాట్ టాపిక్‌గా లేడీ డాన్ జిక్రా.. ఏకంగా ఢిల్లీ సీఎం వార్నింగ్

ఢిల్లీలో లేడీ డాన్ జిక్రా హాట్ టాపింగ్‌గా మారింది. సీలాంపూర్‌లో 17ఏళ్ల కునాల్ హత్య కేసులో ఆమెపై అనుమానాలు ఉన్నాయి. జిఖ్రా క్రైమ్ బ్యాగ్రౌండ్ పోలీసులు వెలికితీస్తున్నారు. ఆమెపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయి. ఈ కేసు సీఎం రేఖా గుప్తా దృష్టికి వెళ్లింది.

New Update
lady don

ఢిల్లీ సీలంపూర్‌లో ఓ లేడీ డాన్ పేరు ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. కునాల్ అనే 17ఏళ్ల మైనర్ బాలుడిని గుర్తుతెలియని దుండగులు గురువారం కత్తితో పొడిచి దారుణంగా చంపారు. ఆ హత్య వెనుక లేడీ గ్యాంగ్ స్టర్ జిఖ్రా ఉందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జిఖ్రా క్రిమినల్ గ్యాంగ్‌లో తిరుగుతుండేదని, గన్‌లో రీల్స్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసిన వీడియోలు కూడా ఉన్నాయి. సీలంపూర్‌లో పరిధిలో ఆమెపై పలు కేసులు కూడా నమోదైయ్యాయి. జిఖ్రాకు అండర్ వరల్డ్‌తో కూడా సంబంధాలు ఉన్నాయన తెలుస్తోంది. జిఖ్రాతో 10 మంది నేరస్తుల గ్యాంగ్ ఉంటుంది. ఢిల్లీలో బడా క్రిమినల్ అయిన గ్యాంగ్ స్టర్ హషీమ్ బాబా భార్య జోయా ఆమెను బౌన్సర్ గా నియమించినట్లు సమాచారం. 

Also Read: Trump: ఇటలీ ప్రధాని మెలోని అంటే నాకు చాలా ఇష్టమంటున్న పెద్దన్న!

గన్‌తో ప్రజలను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోంది. తుపాకులతో రీల్స్ చేసినందుకు ఆయుధ చట్టం కింద జిఖ్రాపై ఎఫ్‌ఐఆర్ కూడా ఫైల్ అయ్యింది. ఆమె కోర్టు హాజరైయ్యేటప్పుడు, పోలీసు కస్టడీలోనూ వీడియోలు తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తోంది. కునాల్ వర్గానికి చెందిన వ్యక్తులు గతంలో జిఖ్రా సోదరుడు సాహిల్ పై దాడి చేశారు. దానికి ప్రతీకారంగా గురువారం సాయంత్రం కునాల్‌ను హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జిఖ్రా బెదిరింపుల కారణంగా కొన్ని హిందూ కుటుంబాలు సీలంపూర్, జాఫ్రాబాద్, బ్రహ్మపురి, గౌతమ్‌పురి మరియు చౌహాన్ బంగర్ వంటి ప్రాంతాల నుండి వలస వెళ్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం గురించి సీఎం రేఖా గుప్తా పోలీస్ కమిషనర్‌తో మాట్లాడానని తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటున్నామని చెప్పారు. 

Also Read:JEE Key-Results Update: జేఈఈ మెయిన్ కీ తొలగించిన ఎన్టీఏ.. ఫలితాల విడుదలపై గందరగోళం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు