/rtv/media/media_files/2025/03/16/BVGY9QCb4RUDjNQHqpyM.jpg)
karnataka Road Accident
Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వంతెన గోడను బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను హిందూపురానికి చెందిన సోమ, నాగభూషణ్, నాగరాజు, మురళిగా గుర్తించారు. వీరంతా.. హిందూపురం నుంచి కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా షహర్‌పూర్ పట్టణం సంతలో గొర్రెలను కొనుగోలు చేయడానికి వెళ్తున్నారు. ఈ సమయంలో రాయ్‌చూర్ జిల్లా దేవ దుర్గ మండలం గబ్బురు పోలీస్ స్టేషన్ పరిధిలోని అమలాపురం దగ్గర ఈ దారుణంగా జరిగింది.
వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో..ఈ ప్రమాదంలో డ్రైవర్ ఆనంద్ గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోని దిగారు. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులకు అడిగి వివరాలు సేరించారు. డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం జరిగి ఉన్నట్లు తెలుస్తోంది. నలుగు వ్యక్తులు మృతి చెందటంలో ఏపీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు కుటుంబాలు కన్నీరుమున్నీరుగా వీలపిస్తున్నారు. కుటుంబం సభ్యులను కోల్పోయిన వారి రోధన చూసి కలత చెందుతున్నారు. ఘటనపై గబ్బూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: వంటలో ఈ మూడు పదార్థాలు వాడితే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు
( AP Crime | ap-crime-news | ap crime updates | ap crime latest updates | ap-crime-report | latest-news | telugu-news )