/rtv/media/media_files/2025/09/07/defection-of-mlas-2025-09-07-19-37-22.jpg)
Defection of MLAs
CM REVANTH : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారి శాసనసభ్యాత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కాగా వారిపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్పందించిన స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. అయితే వారిలో ఒకరిద్దరు మినహా ఎవరు కూడా దానికి సమాధానం చెప్పలేదు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సమావేశం కావడం చర్చనీయంశంగా మారింది.
Also Read : Mahindra Cars: జీఎస్టీ ఎఫెక్ట్..భారీగా తగ్గిన మహీంద్రా కార్లు..తక్షణమే అమలు
ఆదివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో 9 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కడియం శ్రీహరి మినహా మిగిలిన ఎమ్మెల్యేలందరూ హాజరయ్యారు. వారితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, శ్రీధర్ బాబు కూడా సమావేశంలో పాల్గొన్నారు. కాగా ఈ సమావేశంలో రాజీనామాలు, స్పీకర్ నోటీసులపై చర్చించినట్లు తెలిసింది.
ఇది కూడా చూడండి:Ganesh Nimajjanam 2025: వినాయక నిమజ్జనాల్లో అపశ్రుతి.. క్రేన్ తెగి పడి ఇద్దరు.. నీటిలో కొట్టుకుపోయి మరికొరు..!
కాగా, పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. నోటీసులకు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. ముఖ్యంగా అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో కలిశామని ఎమ్మెల్యేలు సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. కాగా బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఖైరతాబాద్ MLA దానం నాగేందర్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రానున్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్‌లో గెలవడంతో పాటు ఖైరతాబాద్‌ను కూడా గెలిపిస్తానంటూ-- అధిష్టానం ముందు దానం నాగేందర్ ప్రతిపాదన చేసినట్లు తెలిసింది.
Also Read : SEAL Team 6 Mission: ఉత్తర కొరియాలో ట్రంప్ సీల్ టీమ్...పౌరుల మృతితో ఫెయిల్
-రాష్ట్రంలో ఉపఎన్నికలు వస్తాయని బీఆర్‌ఎస్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలతో రేవంత్ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలుస్తామని ధీమా వ్యక్తం చేసినప్పటికీ మెజార్టీ ఎమ్మెల్యేలు మాత్రం రాజీనామా చేయడానికి అంతగా ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. కాగా సీఎం తో సమావేశమైన ఎమ్మెల్యేలలో పోచారం శ్రీనివాసరెడ్డి, దానం నాగేందర్, కాలెయాదయ్య, ప్రకాశ్‌గౌడ్, కృష్ణమోహన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, తెల్లం వెంకట్రావు,అరికెపూడి గాంధీ తదితరులున్నారు.