/rtv/media/media_files/2025/09/07/mahindra-2025-09-07-06-52-11.jpg)
Mahindra Cars
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబులను తగ్గించింది. ఇది ఈ నెల 22 నుంచి అమలు అవుతాయని చెప్పింది. అయితే మహీంద్రా మరి కొన్ని కంపెనీలు మాత్రం ప్రభుత్వం ఇచ్చిన టైమ్ కంటే ముందే కొత్త జీఎస్టీను అమలు చేస్తామని చెబుతున్నాయి. అన్ని కంటే ముందు మహీంద్రా కార్లను వినియోగదారులకు చౌకగా ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటి నుంచే కొత్త జీఎస్టీ రేట్లను అమలు చేస్తామని చెప్పింది. ఇదే బాటలో టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టీకేఎం), రెనో ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు తమ వాహనాల ధరలను తగ్గిస్తున్నట్టు శనివారం ప్రకటించాయి. అయితే ఇవన్నీ ఈ నెల 22 నుంచే కొత్త జీఎస్టీలను అమలు చేస్తుండగా..ఒక్క మహీంద్రా మాత్రం వెంటనే తగ్గింపు ధరలను ఇస్తున్నామని చెప్పింది.
మహీంద్రా అన్ని కార్లపై రూ.1.56 లక్షల వరకూ..
మహీంద్రా తన ప్యాసెంజర్ కార్ల ధరలను రూ.1.56 లక్షల వరకు తగ్గించినట్టు కంపెనీ ప్రకటించింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పింది. బొలేరో/నియో రేంజ్ ధర రూ.1.27 లక్షలు, ఎక్స్‌యూవీ3ఎక్స్‌వో పెట్రోల్ వెర్షన్ రూ.1.4 లక్షలు, ఎక్స్‌యూవీ3ఎక్స్‌వో డీజిల్ వెర్షన్ రూ.1.56 లక్షలు, థార్2డబ్ల్యూడీ (డీజిల్) రూ.1.35 లక్షలు, థార్4డబ్ల్యూడీ (డీజిల్) రూ.1.01 లక్షలు, స్కార్పియో క్లాసిక్ రూ.1.01 లక్షలు, థార్‌రాక్స్ రూ.1.33 లక్షలు, ఎక్స్‌యూవీ700 రూ.1.43 లక్షల మేర ధరలు తగ్గనున్నాయి.
3.49 లక్షల వరకు తగ్గనున్న టొయోటా..
టొయోటా లో అన్ని వాహనాలు దాదాపుగా రూ. 3.49 లక్షల వరకు తగ్గనున్నాయి. హ్యాచ్‌బ్యాక్ ధర రూ.85,300.. టైసర్ ధర రూ.1.11 లక్షలు, రుమియన్ ధర రూ.48,700, హైరైడర్ రూ.65,400, క్రిస్టా రూ.1.8 లక్షలు, హైక్రాస్ రూ.1.15 లక్షలు, ఫార్చూనర్ ధర రూ.3.49 లక్షలు తగ్గనున్నాయి. అలాగే లెజెండర్ ధర రూ.3.34 లక్షలు తగ్గే అవకాశం ఉండగా.. హైలక్స్ ధర రూ.2.52 లక్షలు, కామ్రీ ధర రూ.1.01 లక్షలు, వెల్‌ఫైర్ ధర రూ.2.78 లక్షలు దాకా తగ్గుతాయి.
ధరలు తగ్గించే యోచనలో మారుతి..
భారత దేశం సొంత తయారీ కారు, అతి పెద్ద కంపెనీ అయిన మారుతీ కూడా ధరలను తగ్గించు ఆలోచన చేస్తోంది. ఆల్టో ధర రూ.40,000-50,000, వ్యాగన్ ఆర్ ధర రూ.60,000-67,000 మధ్య తగ్గవచ్చని తెలిపింది. ఆల్టో కే10 రూ.40వేలు, వ్యాగన్ ఆర్ రూ.57 వేలు, స్విఫ్ట్ రూ.58వేలు, డిజైర్ రూ.61 వేలు, బాలెనో రూ.60వేలు, ఫ్రాన్‌ఎక్స్ రూ.68వేలు, బ్రెజ్జా రూ.78వేలు, ఎర్టిగా రూ.41వేలు, సెలేరియో రూ.50వేలు, ఎక్స్‌ఎల్ 6 రూ.35 వేలు, జిమ్నీ రూ.1.14 లక్షలు, ఇగ్నిస్ రూ.52వేలు, ఇన్విక్టో రూ.2.25 లక్షలు, ఎస్-ప్రెసో రూ.38 వేలు దాకా తగ్గే అవకాశం ఉంది. కొత్త జీఎస్టీ వలన చిన్న కార్లు కొనే వాళ్ళకు ప్రయోజనం ఉంటుందని మారుతీ సుజుకీ చైర్మన్ ఆర్‌సీ భార్గవ చెప్పారు. దీని వలన ఈ ఏడాది అమ్మకాల్లో 10 శాతం వృద్ధి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.