/rtv/media/media_files/2025/09/07/seal-six-2025-09-07-07-42-10.jpg)
ఉత్తర కోరియా, అమెరికాల మధ్య దౌత్య సంబంధాలు చాలా రోజులుగా సరిగ్గా లేవు. ఈ క్రమంలో అమెరికా ఆ దేశంలో నిఘా పరికరాన్ని అమర్చేందుకు ఓ రహస్య ఆపరేషన్ ను నియమించింది. అమెరికాలో అత్యంత రహస్య ఆపరేషన్లు నిర్వహించే నేవీ సీల్ సిక్స్ బృందం దీనిని చేపట్టింది. కిమ్ జోంగ్ ఉన్ కు సంబంధించి ప్రైవేటు కమ్యూనికేషన్‌ను నిరోధించే ఓ ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉత్తర కొరియాలో అమర్చడం నేవీ సీల్ సిక్స్ పని. దాని ద్వారా ఉత్తర కొరియా సమాచారం అంతా అమెరికాకు చేరాలన్నది వారి ఆలోచన. ఇది అత్యంత రిస్క్ తో కూడిన మిషన్. అమెరికా అధ్యక్షుడి ఆమోదం లేనిదే దీనిని ఎవరూ చేయలేరు. కాబట్టి ఇదంతా ట్రంప్ ఆమోదంతోనే జరిగిందనేది తెలుస్తోంది. అయితే నేవీ సీల్ చేపట్టిన ఈ ఆపరేషన్ లో కమాండోలు జరిపిన కాల్పుల్లో ఉత్తర కొరియాకు చెందిన జాలర్లు మరణించారని తెలుస్తోంది. దాంతో వెంటనే నేవీ సీల్ తన ఆపరేషన్ ను నిలిపి వేసింది.
2019లో మొదలైన ఆపరేషన్..
ఉత్తర కొరియాలో చేపట్టిన ఈ నేవీ సీల్ సిక్స్ రహస్య ఆపరేషన్ 2019లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మొదలైందని తెలుస్తోంది. ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అమెరికా-ఉ.కొరియా మధ్య 2018లో దౌత్య చర్చలు మొదలయ్యాయి. ఆ తర్వాత నిఘా పరికరాన్ని అమర్చాలనే ప్రణాళికను పెంటగాన్ నిర్ణయించింది. దీని కోసం అణు సామర్థ్యం కలిగిన జలాంతర్గామిని ఉత్తర కొరియా తీరానికి పంపించింది. అక్కడ నుంచి రెండు మినీ సబ్‌మెరైన్ల ద్వారా ఒడ్డుకు చేరుకొని నిఘా పరికరాన్ని అమర్చాలనేది ప్లాన్. ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టిన ‘రెడ్ స్క్వాడ్రన్’ యూనిట్‌లోని సీల్ బృందానికి ఈ పనిని అప్పజెప్పింది. అయితే అక్కడ సరిహద్దు ఆంక్షల కారణంగా డ్రోన్లు, ఇంకే ఇతర టెక్నాలజీ వినియోగించే వీలు లేకుండా పోయింది. కేవలం శాటిలైట్ ఇమేజ్ ల ద్వారానే పని చేయాల్సి వచ్చింది. దీంతో సీల్ టీమ్ కు నిఘా పరికరాన్ని అమర్చడానికి చాలా టైమ్ పట్టింది.
2019లో ఓ రాత్రి..
2019లో వియత్నాంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ తో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీకి రెడీ అవుతున్నారు. దానికి ముందు ఆపరేషన్ సీల్ తన పనిని మొదలెట్టింది. నలుపురంగు సూట్‌లు, నైట్-విజన్ అద్దాలతోపాటు నిఘాకు చిక్కని ఆయుధాలు ధరించిన కమాండోలు తీరానికి చేరింది. అయితే వారు లక్ష్యాన్ని పూర్తి చేసే సమయంలో ఉత్తర కొరియాకు చెందిన ఓ చిన్న బోటు వారికి దగ్గరగా వచ్చింది. తమవైపు ఫ్లాష్‌లైట్‌లు వేయడంతో ముప్పు ఎదురైందని గ్రహించిన సీల్ బృందం వారిపై కాల్పులు జరిపింది. దీంతో అందులో ఉన్నవారందరూ మరణించారు. దెబ్బకు సీల్ బృందం వెంటనే ఆపరేషన్ ను ఆపేసింది. దీని గురించి తాజాగా మరోసారి బయటకు వచ్చింది. దీని గురించి ట్రంప్ యంత్రాంగం అమెరికా కాంగ్రెస్‌లోని కీలక సభ్యులకూ తెలియజేయలేదని.. ఇది ఆందోళనకర విషయమని న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది.
Also Read: Mahindra Cars: జీఎస్టీ ఎఫెక్ట్..భారీగా తగ్గిన మహీంద్రా కార్లు..తక్షణమే అమలు