Telangana: రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడడంలో రాహుల్ గాంధీ విఫలం: కేటీఆర్
రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ సవరణకు కట్టుబడి ఉన్నామని చెప్పిన కాంగ్రెస్.. ఒకవైపు ఇతర పార్టీలలో గెలిచిన వారిని కాంగ్రెస్లో చేర్చుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతోందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాలన్నారు.