Ganesh Nimajjanam 2025: వినాయక నిమజ్జనాల్లో అపశృతి.. క్రేన్ తెగి పడి ఇద్దరు.. నీటిలో కొట్టుకుపోయి మరొకరు..!

యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు హరిద్వార్‌లోనే గణేశ్ నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. నిమజ్జనం చేసే సమయంలో క్రేన్ తెగి పడటంతో ఇద్దరు భక్తులపై వినాయకుడు పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. హరిద్వార్‌లో నిమజ్జనం చేస్తూ నీటిలో కొట్టుకుపోయిన ఘటన చోటుచేసుకుంది.

New Update
Ganesh Nimajjanam

Ganesh Nimajjanam

గణపతి నిమజ్జన(Ganesh Nimajjanam) సమయంలో వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు ప్రమాదాలు  జరిగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు హరిద్వార్‌లోనే గణేశ్ నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలోని కొలనులో వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. నిమజ్జనం కోసం క్రేన్‌తో విగ్రహాన్ని ఎత్తి దింపుతున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా క్రేన్ వైర్ తెగిపోయింది. దీంతో భారీ వినాయక విగ్రహం దాని కింద ఉన్న భక్తుల మీదకు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వెంటనే పోలీసులు, గ్రామస్థులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే గాయపడిన ఇద్దరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. 

ఇది కూడా చూడండి: History of Balapur Laddu: బాలాపూర్ లడ్డూ ప్రత్యేకతలివే...

నిమజ్జనం చేస్తూ నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి..

ఇదిలా ఉండగా హరిద్వార్‌(Haridwar) లోనూ గణపతి నిమజ్జనం సమయంలో ప్రమాదం జరిగింది. గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఒక భక్తుడు గంగా నదిలో కొట్టుకుపోయాడు. వినాయక విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి నిఖిల్ గుప్తా (38) అనే వ్యక్తి గంగా నదిలోకి వెళ్లి అదుపు తప్పి పడిపోయాడు. అక్కడ ఉన్నవారు రక్షించడానికి ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. నీటి వేగం అధికంగా ఉండటంతో కొట్టుకునిపోయాడు. కాపాడమని అరిచిన నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ఎవరూ ముందడుగు వేయలేదు. స్థానికులు వెంటనే పోలీసులకు తెలిపారు. నీటిలో కొట్టుకుపోయిన వ్యక్తి కోసం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Balapur Ganesh Laddu: కోటి ఖర్చైనా పర్లేదు..బాలాపూర్ లడ్డూకు ఈ సారి భారీ పోటీ!

Advertisment
తాజా కథనాలు